Kamala Harris: ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అమెరికా. దానికి అధ్యక్షులు కావడమంటే అదృష్టం ఉండాలి. అంత పెద్ద దేశానికి మన దేశస్తురాలు అయిన ఓ మహిళ అర్హత సాధించడం నిజంగా విశేషమే. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఆమె కొద్ది రోజుల పాటు అధ్యక్షురాలిగా చలామణి కానున్నారని తెలుస్తోంది. ఆరోగ్య కారణాల రీత్యా అధ్యక్షుడు జో బైడెన్ కొద్ది రోజులు పరీక్షల కోసం అనస్టీసియాలో ఉన్న కాలంలో ఉపాధ్యక్షురాలికి బాధ్యతలు బదిలీ చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.

జో బైడెన్ ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం పరీక్ష చేయించుకునేందుకు వెళ్లనున్నారు. దీంతో ఆ సమయంలో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కొద్ది కాలమైనా ఆ బాధ్యతలు నిర్వహించడం హుందాతనానికే ప్రతీకగా భావిస్తారు. అలాంటి అదృష్టం ఇప్పుడు మన కమలా హారీస్ కు పట్టడం నిజంగా ఓ వరంగానే భావించాలి.
గతంలో కూడా అధ్యక్షుడు జార్జి బుష్ కూడా ఇలాంటి విధానాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. జార్జిబుష్ కొలనోస్కోపీ పరీక్షల కోసం 2002, 2007 సంవత్సరాల్లో వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు బైడెన్ కూడా తన ఆరోగ్య కారణాల దృష్ట్యా వెళ్లనున్నారు. దీంతో కమలా హారీస్ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆమె మనకు గర్వకారణంగా నిలుస్తారని అందరు భావిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: చంద్రబాబు ఏడుపుపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదీ!
బైడెన్ సెప్టెంబర్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మద్యం తాగకపోయినా, పొగతాగకపోయినా ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రతి సంవత్సరం పరీక్షలు చేసుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీంతోనే మన నాయకురాలు అయిన కమల హారీస్ కు అమెరికా అధ్యక్షురాలిగా వ్యవహరించే అవకాశం రావడం నిజంగా మంచి సమయమే అని చెప్పుకోవాలి.
Also Read: Chandrababu: చంద్రబాబు కన్నీళ్లకు తెలుగు తమ్ముళ్ల ప్రతీకారమా?