సీఎం పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ ఎట్టకేలకు రాజీనామా చేశారు. దానితో గత నెలరోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడిన్నట్లు అయింది. గవర్నర్‌ లాల్జి టాండన్‌ను కమల్‌నాథ్‌ రాజ్‌భవన్‌లో కలిసి రాజీనామా సమర్పించారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతోకమల్‌నాథ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 3:25 pm
Follow us on

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ ఎట్టకేలకు రాజీనామా చేశారు. దానితో గత నెలరోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడిన్నట్లు అయింది. గవర్నర్‌ లాల్జి టాండన్‌ను కమల్‌నాథ్‌ రాజ్‌భవన్‌లో కలిసి రాజీనామా సమర్పించారు.

శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతోకమల్‌నాథ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామా చేసిన 22 మంది ఎమ్యెల్యేలలో ఆరుగురు మంత్రుల రాజీనామాలను ముందుగానే ఆమోదించిన స్పీకర్ 16 మంది రాజీనామాలను గురువారం రాత్రి ఆమోదించారు. దానితో కాంగ్రెస్ మైనారిటీలో పడింది.

కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాగా సీఎంగా ‍ప్రమాణం చేసిన 15 నెలల్లోనే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

‘‘బెంగళూరులో ఎమ్మెల్యేలను నిర్బంధించడం వెనుక ఉన్న అసలు నిజమేంటో దేశ ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు. అసలు నిజం బయటికి వస్తుంది. ప్రజలు వాళ్లను క్షమించరు. ప్రజలు నాకు ఐదేళ్లు పరిపాలించమని అధికారం ఇస్తే.. నన్ను ఎప్పుడు దించాలా అని బీజేపీ కుట్రలు పన్నుతూ వచ్చింది..’’ అని ఆరోపించారు. గత 15 ఏళ్లుగా బీజేపీ చేయలేని అభివృద్ధిని తాను 15 నెలల్లో చేసి చూపించానని కమల్‌నాథ్ పేర్కొన్నారు.

‘‘అత్యాశపరులైన మా ఎమ్మెల్యేలతో బీజేపీ చేతులు కలిపింది. మా ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ నమ్మక ద్రోహం చేసింది. మా ప్రభుత్వ పతనం కోసం బీజేపీ ఎదురుచూసింది. మధ్యప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా. రాష్ట్రానికి కొత్త రూపు ఇవ్వడానికి ప్రయత్నించాను. 15 ఏళ్లలో చేయలేని పనులను 15 నెలల్లో చేశాను..’’ అని ఆయన తెలిపారు.