Kaleshwaram: మళ్లీ కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ..

Kaleshwaram: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కాలేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మి పంపు హౌస్‌లో గోదావరి నీటి ఎత్తిపోతలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇంజినీఇంగ్‌ అధికారులు మధ్యాన్నం 12:30 గంటల ప్రాంతంలో మూడు మోటార్లు ఆ¯Œ చేసి నీటి లిఫ్టింగ్‌ ప్రారంభాంచారు. దాదాపు ఏడాది తర్వాత ఎత్తిపతలను పునఃప్రారంభించారు. -బ్యారేజీలు ఖాళీ కావడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు పురిధిలోని సర్వతి, గాయత్రి, ఎల్లంపల్లి బ్యారేజీలు పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను గత ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. […]

Written By: NARESH, Updated On : April 6, 2022 4:46 pm
Follow us on

Kaleshwaram: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కాలేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మి పంపు హౌస్‌లో గోదావరి నీటి ఎత్తిపోతలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇంజినీఇంగ్‌ అధికారులు మధ్యాన్నం 12:30 గంటల ప్రాంతంలో మూడు మోటార్లు ఆ¯Œ చేసి నీటి లిఫ్టింగ్‌ ప్రారంభాంచారు. దాదాపు ఏడాది తర్వాత ఎత్తిపతలను పునఃప్రారంభించారు.

-బ్యారేజీలు ఖాళీ కావడంతో..
కాళేశ్వరం ప్రాజెక్టు పురిధిలోని సర్వతి, గాయత్రి, ఎల్లంపల్లి బ్యారేజీలు పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను గత ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. 50 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ బ్యాంరేజీలో ఈ ఏడాది 30 టీఎంసీల నీటిని నింపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకేసారీ పూర్తిస్థాయిలో నీటిని నింపితే సీపేజీ కారణంగతా రిజర్వాయర్‌ కట్టపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గతేడాది గోదావరి నదిలో వరద రూపంలో చేరిన నీటిని లిఫ్ట్‌ చేస్తూ.. మల్లన్నసాగర్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం మల్లన్న సాగర్‌లో నిర్దేశిత మేరకు నీటి మట్టం చేరుకోలేదు. ఈ క్రమంలో కాలేశ్వరం పరిధిలోని కొండపోచమ్మ, శ్రీరాజరాజేశ్వర మధ్యమానేరు ప్రాజెక్టు, ఎల్లంపల్లి బ్యారేజీ, గాయత్రి, సరస్వతి రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయి. ఎల్లంపల్లి రిజర్వాయర్లో ప్రస్తుతం నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయింది. మిడ్‌మానేరుకు ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా నీరు రావడం లేదు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మకు నీటిని తరలించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతలను మళ్లీ ప్రారంభించారు. లక్ష్మీ బ్యారేజి నుంచి లిఫ్ట్‌ చేసిన నీటిని ఎల్లంపల్లి, మధ్యమానేరు మీదుగా కొండపోచమ్మకు తరలించనున్నారు. అక్కడి నుంచి మళ్లన్న సాగర్‌కు లిఫ్ట్‌ చేస్తారు.

-మల్లన్నసాగర్‌ కోసమే..
ప్రస్తుతం యాసంగి పంటలు చివరి దశకు చేరుకున్నాయి. నీటి వినియోగం క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతలను పునఃప్రారంభించింది. కేవలం మల్లన్న సాగర్‌ను నింపేందుకే ఎత్తిపోతలు ప్రారంభించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం లిఫ్ట్‌ ద్వారా విద్యుత్‌ బిల్లు ప్రభుత్వానికి భారంగా మారుతోంది. గతేడాది వేసవిలో లిఫ్ట్‌ చేసిన గోదావరి నీటిని మొత్తం వర్షాకాలంలో వచ్చిన వరదలకు దిగువకు వదిలారు. దీంతో విద్యుత్‌ ఖర్చులు వృథా అయ్యాయి. గత అనుభవాల నేపథ్యంలో మళ్లీ నీటిని లిఫ్ట్‌ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మల్లన్నసాగర్‌ను నింపుకునేందుకే కాళేశ్వరం ఎత్తిపోతలు పునఃప్రారంభించారని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. మరికొందరు నీటిని లిఫ్ట్‌ చేయడం ద్వారా చేతికి వచ్చిన పంటలు మళ్లీ నీటమునుగుతాయని, వరి కోతలకు ఇబ్బంది అవుతుందని పేర్కొంటున్నారు.

Tags