CM KCR- Governor Tamilisai: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఢిల్లీ వేదికగా కేసీఆర్ విషయం తేల్చాలని గవర్నర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆమె హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సీఎం ఢిల్లీలో ఉండగానే గవర్నర్ హోంమంత్రితో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై అమిత్ షా ఏమేరకు స్పందిస్తారో తెలియడం లేదు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై గవర్నర్ అమిత్ షాకు నివేదిక అందజేశారు. గవర్నర్ పాత్రను తగ్గిస్తూ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే ముగించారని ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్ కు అమిత్ షా ఏం షాక్ ఇస్తారో అంతుబట్టడం లేదు.
మొత్తానికి కేసీఆర్ వ్యవహారం మాత్రం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇన్నాళ్లు ఏదో అని సర్దుకుపోయిన గవర్నర్ ఇక పోరు బాట పట్టారు. ఉపేక్షించేది లేదని పార్టీ పెద్దలకు కేసీఆర్ తీరుపై నివేదిక అందజేశారు. ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. దీనికి అధికారిక పర్యటనగా చూపిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నా లెక్క చేయడం లేదు. దీంతో భవిష్యత్ లో కేసీఆర్ కు ఇక కష్టాలే అని తెలుస్తున్నాయి.
Also Read: CM Jagan Delhi Tour: సీఎం జగన్ లో కనిపించని జోష్.. ఢిల్లీ పర్యటన తుష్
గవర్నర్ ను కావాలనే పక్కన పెట్టడంతో ఆమెకు ఆగ్రహం కలుగుతోంది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన తనకు గౌరవం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఢిల్లీలో పెద్దలను కలిసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గవర్నర్ అంటే ఎంతటి గౌరవం ఇస్తారో పక్క రాష్ట్రాల వారిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. కావాలనే దురుద్దేశంతో పార్టీ నేతలు కూడా గవర్నర్ ను లెక్కలోకి తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.
ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారంలో కలుగజేసుకుని కేసీఆర్ ను వివరణ కోరే అవకాశం ఉంది. ఎందుకు గవర్నర్ పై అక్కసు ఎందుకు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలియడం లేదు. మొత్తానికి కేసీఆర్ పై యుద్ధానికే గవర్నర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాబోయే కాలంలో ఇంకా మార్పులు ఎలా చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
Also Read:AP Cabinet Reshuffle: కొత్త మంత్రివర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారా?