Joe Biden: చేసిన తప్పుకు మౌనంగా తలిదించుకున్న అమెరికా అధ్యక్షుడు

అమెరికా దేశం అస్తవ్యస్థ పాలన.. దూకుడుతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ను వద్దని దించేసింది. సీనియర్ రాజకీయవేత్త.. ఎంతో అనుభవం ఉన్న జోబిడెన్ అమెరికా అధ్యక్షుడిని చేసింది. అంతే స్థాయిలో వ్యవస్థలను చక్కబెట్టే ఆలోచనలో జోబిడెన్ ఉన్నాడు. అయితే ఒకే ఒక్క నిర్ణయం.. అమెరికా అధ్యక్షుడికి తలవంపులు తెంచింది. పొగిడిన వారే తిడుతున్న పరిస్థితిని కల్పించింది. ఇప్పుడు అమెరికన్ సైనికులను పొట్టన పెట్టుకుంది. అదే ‘అప్ఘనిస్తాన్ నుంచి అమెరికా వైదొలగడం..’ అప్ఘనిస్తాన్ నుంచి ఉన్న […]

Written By: NARESH, Updated On : August 27, 2021 2:00 pm
Follow us on

అమెరికా దేశం అస్తవ్యస్థ పాలన.. దూకుడుతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ను వద్దని దించేసింది. సీనియర్ రాజకీయవేత్త.. ఎంతో అనుభవం ఉన్న జోబిడెన్ అమెరికా అధ్యక్షుడిని చేసింది. అంతే స్థాయిలో వ్యవస్థలను చక్కబెట్టే ఆలోచనలో జోబిడెన్ ఉన్నాడు. అయితే ఒకే ఒక్క నిర్ణయం.. అమెరికా అధ్యక్షుడికి తలవంపులు తెంచింది. పొగిడిన వారే తిడుతున్న పరిస్థితిని కల్పించింది. ఇప్పుడు అమెరికన్ సైనికులను పొట్టన పెట్టుకుంది. అదే ‘అప్ఘనిస్తాన్ నుంచి అమెరికా వైదొలగడం..’

అప్ఘనిస్తాన్ నుంచి ఉన్న ఫళంగా అమెరికా వైదొలగాలని అధ్యక్షుడు జోబైడెన్ తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద తప్పు ఆ పర్యవసనాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అప్ఘన్ ను తాలిబన్లు వశపరుచుకోవడం.. అక్కడి ప్రజల మాన, ప్రాణ, ధనలకు విలువ లేకుండా పోవడం.. ఇప్పుడు ఐసీస్ ఉగ్రసంస్థ ఏకంగా కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 103 మంది ప్రాణాలు తీయడం.. అందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉండడం తీవ్ర సంచలనమైంది. ఈ ఉపద్రవం అంతటికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కారణమని ప్రపంచవ్యాప్తంగా.. అమెరికాలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఐసిస్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో చనిపోయిన అమెరికన్ సైనికులకు నివాళి అర్పిస్తూ వైట్ హౌస్ నుంచి జోబైడెన్ జాతినుద్దేశించి ప్రసంగించాడు. మృతిచెందిన అమెరికన్ సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఆ సమయంలో జోబైడెన్ ముఖమంతా ఉద్వేగంతో నిండిపోయింది. దాదాపు కంటతడి పెట్టేంతలా బిడెన్ బాధపడిపోయాడు. విలేకరులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న వేళ కొద్దిసేపు మౌనంగా రోదించారు.

ఈ సందర్భంగా అమెరికన్ సైనికులను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని గట్టి ప్రతిజ్ఞ చేశాడు. కాబూల్ ఘటన ప్రస్తుతం జోబైడెన్ పీఠాన్ని షేక్ చేస్తోంది. అధ్యక్షుడి నిర్ణయాలపై మీడియా, ఇంటా బయటా, రిపబ్లికన్లు కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బైడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్ఘనిస్తాన్ వ్యవహారంలో జోబైడెన్ ఫెయిల్ అయ్యాడన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అందుకే విలేకరుల సమావేశంలో ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేకుండా మౌనంగా రోదించడం కనిపించింది.