https://oktelugu.com/

KA Paul: పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే.. నన్ను ప్రధానమంత్రిని చేయండి.. కేఏ పాల్ కామెడీ కితకితలు..

KA Paul Frustrated On Power Star Pawan Kalyan Fans: టాలీవుడ్ లో అగ్రహీరో అయ్యిండి.. అశేష అభిమాన గణం ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఇతర పార్టీలను ఓడించడానికి సార్వత్రిక ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలతో బరిలోకి దిగే ‘కేఏ పాల్’ ఎక్కడ? పైగా పవన్ కళ్యాణ్ తనతో చేతులు కలిపితే సీఎం పోస్ట్ ఇస్తాడట.. ఈయనేమో పీఎం సీట్లో కూర్చుంటాడట.. ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్ తాజాగా విడుదల చేసిన వీడియోలో చేసిన ‘సీరియస్ కామెడీ’కి ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 6, 2022 / 03:42 PM IST
    Follow us on

    KA Paul Frustrated On Power Star Pawan Kalyan Fans: టాలీవుడ్ లో అగ్రహీరో అయ్యిండి.. అశేష అభిమాన గణం ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఇతర పార్టీలను ఓడించడానికి సార్వత్రిక ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలతో బరిలోకి దిగే ‘కేఏ పాల్’ ఎక్కడ? పైగా పవన్ కళ్యాణ్ తనతో చేతులు కలిపితే సీఎం పోస్ట్ ఇస్తాడట.. ఈయనేమో పీఎం సీట్లో కూర్చుంటాడట.. ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్ తాజాగా విడుదల చేసిన వీడియోలో చేసిన ‘సీరియస్ కామెడీ’కి ఇప్పుడు జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారట..

    గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అచ్చం వైసీపీ పార్టీని పోలిన.. ఆయన ఫ్యాన్ గుర్తును పోలిన సింబల్ తెచ్చుకొని ఏపీ రాజకీయాల్లో కేఏపాల్ ‘ప్రజాశాంతి’ పార్టీ తరుఫున బరిలోకి దిగిన చేసిన కామెడీ అంతా ఇంతాకాదు. వైఎస్ జగన్ ను ఓడించడానికి కేఏ పాల్ ను దించి.. ఆయన వెనుక చంద్రబాబే ఉండి నడిపించాడన్న ప్రచారం జోరుగా సాగింది. అదేంటో కేఏ పాల్ ఎంతో సీరియస్ గా ప్రసంగాలు చేస్తుంటాడు. ఆ స్లాంగ్ లో ఆగ్రహంతో ఊగిపోతాడు.. కానీ జనాలు మాత్రం ఆ వీడియోలు చూసి నవ్వుకుంటారు.. అస్సలు అర్థం కాని క్యాండిడేట్ గా కేఏపాల్ ను ఇప్పటికీ జనాలు భావిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

    కేఏ పాల్ సీరియస్ కామెడీ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లోనే ఆగిపోయింది. ఆ తర్వాత అమెరికా వెళ్లి కొద్దికాలం కనిపించలేదు. ఆడపదడపా అప్పుడప్పుడూ ఆందోళనలప్పుడు బయటకొచ్చి హంగామా చేస్తుంటాడు. ఈ మధ్య ఉక్రెయిన్ దేశానికి మద్దతుగా కేఏపాల్ రంగంలోకి దిగి రష్యా అధ్యక్షుడు పుతిన్ ను తిట్టి.. యుద్ధాన్ని ఆపేస్తానంటూ సీరియస్ కామెడీ చేశాడు. ఇంతమంది .. ఇన్ని దేశాలు ప్రయత్నిస్తున్నా.. ఆగని యుద్దాన్ని ‘ఛూ.. మంత్రకాళి’ అని కేఏపాల్ చెబితే పుతిన్ భయపడి ఆపేస్తాడేమో తెలియదు కానీ.. ఇప్పుడు ఆయన మాటలు అయితే వైరల్ అయ్యాయి.

    ఇటీవల చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ తో పొత్తుకు ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. దానిపైనే కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘చంద్రబాబు లవ్ చేస్తున్నాడట.. పవన్ ను లవ్ చేయమంటున్నాడు.. కానీ చంద్రబాబుతో ఏం కాదని.. జనసేన నేతలు, కార్యకర్తలు అంతా ప్రజాశాంతి పార్టీకి సపోర్టు చేసి నన్ను ప్రధానమంత్రిని చేస్తే ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను చేస్తానని’ కేఏపాల్ సంచలన కామెడీ ప్రతిపాదన చేశారు.దీన్ని చూసి జనాలంతా నవ్వుకుంటున్నారు.

    ఎందుకంటే పోయిన సారి ఎన్నికల్లో పోటీచేస్తే ప్రజాశాంతి పార్టీకి కనీసం డిపాజిట్లు దక్కలేదు. కేఏ పాల్ ముఖం చూసి కూడా ఒక్క ఓటు వేయలేదు. కేవలం ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వచ్చి కామెడీ చేసి వెళ్లిపోయిన కేఏ పాల్ ను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి పాల్ ఏకంగా ఏపీలో ప్రత్యామ్మాయ శక్తిగా ఎదుగుతున్న పవన్ కళ్యాన్ కు ఆఫర్ ఇవ్వడం చూసి జనాలు అంతా నవ్వుకుంటున్నారు. కేఏపాల్ కామెడీని షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘పాల్ గారూ మీ కామెడీ ఆపండి సార్.. మీరు ప్రధాని ఏంటి? అంటూ’ సెటైర్లు వేస్తున్నారు.

    వీడియో