Homeజాతీయ వార్తలుJungle Raj slogan history: ఆర్జేడీ+కాంగ్రెస్‌ పతనాన్ని శాసించిన జంగిల్‌ రాజ్‌ స్లోగన్‌.. దీనికి మూలం...

Jungle Raj slogan history: ఆర్జేడీ+కాంగ్రెస్‌ పతనాన్ని శాసించిన జంగిల్‌ రాజ్‌ స్లోగన్‌.. దీనికి మూలం ఓ పుస్తకం!

Jungle Raj slogan history: బిహార్‌ 2025 శాసనసభ ఎన్నికల్లో తేజశ్వీ యాదవ్‌ సారథ్యంలోఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమి ఘన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నితీశ్‌ కుమార్, నరేంద్ర మోదీ కలయిక ద్వారా ఏర్పడిన రాజకీయ చరిష్మ, ఇప్పటికే నితీశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఆకర్షణీయంగా నిలిచాయి.

Also Read: ఏడాదికి 1.25 కోట్ల ప్యాకేజీ.. ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి.. చివరికి ఏం జరిగిందంటే?

అయితే ఈ ఎన్నికల్లో మహాగట్ బంధన్‌ ఓటమిని శాసించింది మాత్రం ‘జంగిల్‌ రాజ్‌‘ స్లోగన్‌. 2020 ఎన్నికల్లో దీనిని పెద్దగా ప్రచారం చేయలేదు. పట్టించుకోలేదు. కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ‘జంగిల్‌ రాజ్‌ వస్తుంది… జాగ్రత్త‘ అనే హెచ్చరిక ప్రజల మనసును సూటిగా తాకాయి. లాలూ పాలనలో సాగిన అచారకాలు ఓటర్ల కళ్ల ముంద కదలాడేలా చేసింది. లాలు పాలనలో ఉన్న అనేక అవినీతులు, నేరసంఘటనలు మేమరుపరచకుండా ప్రజలకు గుర్తు చేసించారు. ఈ స్లోగన్‌కు మూలం ఓ పుస్తకం. జర్నలిస్టు మృత్యుంజయ శర్మ రాసిన “Broken Promises: Caste, Crime, Politics in Bihar”. ఈ ఇంగ్లీష్‌ పుస్తకం ప్రభావవంతంగా ఉపయోగించారు.

మొదట పట్టించుకోలేదు..
బిహార్‌లో ఇంగ్లిష్‌ తక్కువ దీంతో ఈ పుస్తకాన్ని మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ యూట్యూబర్‌లు దీన్ని పునర్నవీకరించి జంగిల్‌ రాజ్‌ అర్థాన్ని ప్రజల్లో వ్యాపింపజేశారు, దీనివల్ల రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. అదనంగా, తేజశ్వీ యాదవ్‌ కీలక రాజకీయ కార్యక్రమాలలో దుర్భాషలు వాడటం, మెదటి పుణ్యకేసులు ప్రజాస్వామ్య రంగంలో ఎక్కువగా వెలుగులోకి రాకపోవడం, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం కూడా మహా గట్‌బంధన్‌ ఓటమిని శాసించింది.

Also Read: వారం రోజులకే సీఎం కుర్చి దిగిపోయారు.. ఆ తర్వాత నితీష్ కుమార్ కథ మొదలైంది!

వీడియోలు వైరల్‌..
మోదీ, నితీశ్‌ జంగిల్‌రాజ్‌ నినాదంతోపాటు అనేక ఉదాహరణలు సభల్లో వివరించారు. దీంతో లాలూ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రజల కళ్ల ముందు కదలాడాయి. ఇదే సమయంలో జేడీయూ, బీజేపీ నాయకులు యూట్యూబ్‌ వీడియోలను వైరల్‌ చేశారు. బిహార్‌ అంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. శిల్పి గౌతమ్‌ హత్య కేసు ఓ ఆర్జేడీ నాయకుడి ఇంట్లో దొరికాయి. కేసు ముందుకు సాగలేదు. నీసా భారతి ఎంబీబీఎస్‌ సీటు ఇవ్వలేదు. టాటా గ్రూప్‌కు చెందిన వ్యక్తిగా చూపించి అడ్మిషన్‌ ఇచ్చారు. తర్వాత పాట్నాకు బదిలీ చేసుకుని ఎంబీబీఎస్‌ పాస్‌ అయింది. రోహిణీ ఆచార్య ఆమె లాలూకు కిడ్నీ ఇచ్చింది. ఈమె పెళ్లి సమయంలో బిహార్‌లోని కార్ల షోరూం నుంచి కార్లు తీసుకుపోయారు. గెస్టులకు ఉపయోగించారు. ఫుల్లుగా వాడుకుని తిరిగి ఇచ్చారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. ఐఏఎస్‌ చంపా విశ్వాస్‌ భార్యను కిడ్నాప్‌ చేసి ఓ రౌడీ తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ ప్రధాని ప్రచారంలో ప్రస్తావించారు. వీటి కారణంగానే తేజశ్వి యాదవ్‌ వస్తే మళ్లీ జంగల్‌ రాజ్‌ వస్తుందని ప్రజలు భయపడ్డారు. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమిని చిత్తుగా ఓడించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular