Star Heroes: సినిమా ఇండస్ట్రీ అనేది సముద్రం లాంటింది… కొందరు ఆ అలల దాటికి కొట్టుకుపోతుంటే మరికొందరు సముద్రంలో సైతం చేప పిల్లల ఈదుతూ ముందుకు సాగుతున్నారు… కష్టపడిన వాళ్లకు మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ తప్పకుండా వస్తుంది అనేది అందరూ నమ్మే మాట… ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఒకప్పుడు కష్టపడిన వాళ్లే కావడం విశేషం…ఇప్పుడు వస్తున్న నటులు సైతం ఇంతకుముందు ఉన్న హీరోలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళలా కష్టపడాలనే ఒక పాజిటివ్ ఆరా తో ముందుకైతే సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చి ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఎదుగుతారు అనుకున్న కొంతమంది మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు. అందులో శర్వానంద్ మొదటి స్థానంలో ఉంటాడు.
శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు సోలో హీరోగా మాత్రం నిలబడలేకపోతున్నాడు. ఆయనకు వరుసగా సక్సెస్ లు వచ్చినా కూడా ఆయన వాటిని సక్రమంగా వాడుకోలేకపోతున్నాడు. ఇక తన సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
ఒక సినిమా పూర్తి అయ్యేలోపు బ్యాకప్ లో రెండు సినిమాలు ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది… ఇక నితిన్ సైతం అదే బాటలో నడుస్తుండడం విశేషం…తను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయనకి ఇప్పటి వరకు ఒక్క పెద్ద సక్సెస్ కూడా రాలేదు. కెరియర్ మొదట్లో ఒకటి రెండు సక్సెస్ లను సాధించినా ఆయన ఆ తర్వాత తన కెరియర్ లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇప్పటికి తను హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు… అక్కినేని నాగచైతన్య పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఒక సినిమా సక్సెస్ అయితే మరో రెండు సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. కానీ ఆయన బ్యాకప్ లో మాత్రం ఎప్పుడూ రెండు మూడు సినిమాలు ఉంటునే వస్తున్నాయి. ఇక ఇలాంటి ధోరణిలో ఆయన ఏదో సినిమాలు చేస్తున్నామంటే చేస్తున్నామనే రేంజ్ లో ముందుకు సాగుతున్నారు తప్ప సక్సెస్ లను మాత్రం సాధించడం లేదు. కాబట్టి ఇక మీదట వీళ్ళు చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది…