Jubilee Hills Incident: జూబ్లీహిల్స్ రేప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది. బాలికపై మృగాల్లా రెచ్చి పోయి ఆరుగురు అత్యాచారం చేయడం గమనార్హం. దీంతో రాజకీయ పార్టీల విమర్శలతో ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. గత నాలుగైదు రోజులుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఆదివారం నిందితులను తీసుకొచ్చి ఎక్కడెక్కడ రేప్ చేశారనే దానిపై ఆరా తీశారు. వారు తిరిగిన ప్రాంతాలను గుర్తించి ఎవరెవరు ఎలా అత్యాచారం చేశారనే విషయాలు నమోదు చేసుకున్నారు. ఇందులో ఒకరే మేజర్ కాగా ఐదుగురు నిందితులు మైనర్లు కావడం గమనార్హం. దీంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఆదివారం నిందితులను వారి తిరిగిన ప్రాంతాలను ఓ సారి గుర్తించారు. మొదటగా షాబుద్దీన్ అత్యాచారం చేశాడని వారు చెబుతుంటే కార్పొరేటర్ కొడుకే ముందు లైంగిక దాడి చేశాడని షాబుద్దీన్ చెబుతున్నాడు. షాబుద్దీన్ తమను రెచ్చగొట్టడంతోనే తాము అలా ప్రవర్తించామని వారు సమాధానం ఇస్తున్నారు. మొత్తానికి అత్యాచార ఘటనపై వివరాలు తెలుసుకుంటున్నారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో భాగంగా వారిని తీసుకొచ్చి వారి చేత ఏ ఏ ప్రాంతాలు తిరుగుతూ లైంగిక దాడికి పాల్పడ్డారో తెలుసుకున్నారు. చీకటి కావడంతో సరిగా గుర్తించడం లేదని నిందితులు చెబుతున్నా మొత్తానికి రెండు మూడు ప్రాంతాలు తిరుగుతూ బాలికపై బలాత్కారానికి దిగినట్లు సమాచారం.
Also Read: KCR BRS Party: కేసీఆర్ ‘బిఆర్ఎస్’.. ఉండవల్లి, పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు?
బాలిక మొదట లైంగిక దాడి చేసింది కార్పొరేటర్ కుమారుడే అని పోలీసులు తేల్చారు. తరువాత ఏ5 నిందితుడిగా బంజారాహిల్స్ కు చెందిన ఓ ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ కుమారుడు అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు. మొత్తానికి ఇందులో ఆరుగురు నిందితులు ఓ బాలికపై దాడికి పాల్పడటం సంచలనం సృష్టించిందే. దీనికి సంబంధించిన సీన్ రీ కన్ స్ర్టక్షన్ కోసం పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. కేసులో ఇంకా నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఏర్పడింది.

అత్యాచార నిందితులకు బయట నుంచి తెచ్చిన బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి. అత్యాచార ఘటనపై పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో భాగంగా విచారణ చేస్తుంటే నిందితుల కుటుంబ సభ్యులు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే పోలీసుల ముందే వారు వాటిని తిన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పోలీసులు ఖండిస్తున్నారు. బయట నుంచి తెచ్చిన ఏ ప్యాకెట్ కూడా నిందితులకు ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ స్థానికులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు వాదిస్తున్నారు.
Also Read:Anushka Shetty Brother: అనుష్క శెట్టి సోదరుడికి ప్రాణభయం
[…] […]