Jublihils Gang Rape Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీపీ

జూబ్లీహిల్స్ పబ్ కేసులో పోలీసులు అసలు నిందితులను దాచేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్, ప్రతిపక్షాలు అందరూ విమర్శిస్తూ రేప్ నకు ముందు జరిగిన వీడియోలు వైరల్ చేస్తున్న వేళ సీపీ సీవీ ఆనంద్ మీడియా ముందుకొచ్చి అసలు విషయాలు బయటపెట్టారు. గ్యాంగ్ రేప్ ఎలా జరిగింది? ఎవరు చేశారు? అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సంచలన విషయాలను మీడియాకు వివరించారు. ఈ గ్యాంగ్ రేప్ కేసులో   మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు సీపీ […]

Written By: NARESH, Updated On : June 7, 2022 10:13 pm
Follow us on

జూబ్లీహిల్స్ పబ్ కేసులో పోలీసులు అసలు నిందితులను దాచేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్, ప్రతిపక్షాలు అందరూ విమర్శిస్తూ రేప్ నకు ముందు జరిగిన వీడియోలు వైరల్ చేస్తున్న వేళ సీపీ సీవీ ఆనంద్ మీడియా ముందుకొచ్చి అసలు విషయాలు బయటపెట్టారు. గ్యాంగ్ రేప్ ఎలా జరిగింది? ఎవరు చేశారు? అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సంచలన విషయాలను మీడియాకు వివరించారు.

ఈ గ్యాంగ్ రేప్ కేసులో   మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు సీపీ ఆనంద్ తెలిపారు. ఒకరు మేజర్. ఐదుగురు మైనర్లు ఉన్నారని వివరించారు. ఏ1 గా సాదుద్దీన్ తోపాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారని.. మైనర్ తోపాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సీపీ తెలిపారు. నిందితులను బాధితురాలు గుర్తించకపోవడంతోనే కేసు ఆలస్యమైందన్నారు. ఆధారాలతో సహా జూన్ 2న నిందితులను గుర్తించామని.. 3న సాదుద్దీన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగతా వాళ్లపై కేసులు నమోదు చేశామన్నారు.

మే 28న మధ్యాహ్నం 1 గంటకు పబ్ కు బాలిక వచ్చిందని.. ఆమెను ట్రాప్ చేసి ఏమార్చి కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఐదుగురు కలిసి ఆ వాహనంలో అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం సాయంత్రం పబ్ దగ్గర బాధిత బాలికను వదిలిపెట్టారు.

అయితే బాధితురాలిపై అత్యాచారం జరిగి మూడు రోజులైనా ఆమె తన తల్లిదండ్రులు, పోలీసులకు చెప్పలేదని సీపీ తెలిపారు. అప్పటికే 3 రోజులు దాటిపోయిందని తెలిపారు. మెడపై బాలికకు గాయలు చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారని.. మే 31న కేసు నమోదు చేసి బాలిక వివరాలు చెప్పకపోవడంతో భరోసా సెంటర్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ద్వారా మహిళా పోలీసులు వివరాలు రాబట్టి పకడ్బందీగా నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.

ఇలాంటి కేసుల్లో శిక్షలు కఠినంగా ఉంటాయని.. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా పబ్ ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నట్టు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడా? లేడా? అన్నది మాత్రం సీపీ బయటపెట్టలేదు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కు ఆ వీడియోలు ఎలా వచ్చాయో తెలియదన్నారు. ఆయనపై చర్యలపై కూడా సీపీ దాటవేశారు.