Jr NTR: 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి టీడీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. 2023 వరకు టీడీపీ బ్రతికిబట్టకడుతుందా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతోన్నాయి. దీనికితోడు గత కొద్దిరోజులుగా టీడీపీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆపార్టీలో అంతర్గతంగా లుకలుకలు ఉన్నట్లు స్పష్టమవుతోన్నాయి.

రాజకీయంగా ఒకటిగానే కొనసాగుతున్న నందమూరి, నారా ఫ్యామిలీ మధ్య విబేధాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆపార్టీ భారాన్ని మోస్తున్నారు. ఆయన తనయుడు లోకేష్, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ టీడీపీలోనే ఉన్నా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు.
లోకేష్ ట్వీటర్ సందేశాలకు పరిమితం అవుతుండగా బాలయ్య సినిమాలతో బీజీగా ఉన్నారు. వీరిద్దరు అడుపదడుపా మాత్రం ఏపీలో పర్యటిస్తుంటారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా బాలయ్య కేవలం ఆయన నియోజకవర్గానికి పరిమితం అవడం కన్పిస్తూ ఉంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోనే కొనసాగుతున్నాడని ఆపార్టీ నేతలు చెబుతున్నా ఆయన మాత్రం సినిమాలకే పరిమితమైనట్లు కన్పిస్తోంది.
2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరుఫున ఆయన ఎక్కడ పని చేసిన దాఖలాల్లేవు. నారా లోకేష్ భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు, బాలకృష్ణ తదితర ఫ్యామిలీ మెంబర్లు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కుప్పంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటీవల ధర్నాకు దిగడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఈ అనుచిత వ్యాఖ్యల అలజడి ఎన్టీఆర్ కే నష్టం !
కాగా ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. దీనిని నందమూరి ఫ్యామిలీ మూకుమ్మడిగా ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ ఇష్యూపై సున్నితంగా స్పందించారు. అయితే దీనిని టీడీపీలోని పలువురు నేతలు తప్పుబట్టారు. సినిమా కెరీర్ కోసం ఎన్టీఆర్ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ ఇష్యూ కొనసాగుతుండగానే జూనియన్ ఎన్టీఆర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆయన ఫ్యాన్స్ సైతం టీడీపీతోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే కొందరు మాత్రం నారా, నందమూరి ఫ్యామిలీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Also Read: బాబు వలసవాదులను టీడీపీలో చేర్చుకుంటారా?