Security commando collapse: జేపీ.నడ్డా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు. పదవీకాలం ముగిసినా.. ఏడాదికాలంగా ఆయనే కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ, హో మంత్రి అమిత్‌షాకు విధేయుడిగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. నడ్డా పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారన్న భావన కూడా ఉంది. అయితే తాజాగా నడ్డా తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఇందుకు కారణం ఆయన వ్యవహార శైలే.
సెక్యూరిటీ గార్డ్‌ను పట్టించుకోకుండా..
గుజరాత్ వడోదరలో నిర్వహించిన పార్టీ సమావేశంలో జేపీ.నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డు అకస్మాత్తుగా కుప్పకూలాడు. విశ్రాంతి లేక, దీర్ఘకాలంగా నిలబడటం, అలసట కారణంగా పడిపోయాడు. అయితే నడ్డా మాత్రం ప్రసంగం ఆపకుండా.. అసలు గార్డ్‌కు ఏమైందని కూడా ఆరా తీయకుండా తన ప్రసంగం కొనసాగించారు. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
నడ్డా తీరుపై విమర్శలు..
గార్డు పడిపోయిన వెంటనే అక్కడ ఉన్న మిగతా సిబ్బందితోపాటు పార్టీ నాయకులు వచ్చి గార్డును పైకిలేపి పక్కకు తీసుకెళ్లారు. నడ్డా మాత్రం కనీసం స్పందించలేదు. మానవత్వం చూపలేదు. సాధారణంగా సభల్లో ఇలాంటివి జరిగినప్పుడు నేతలు స్పందిస్తారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తారు. ఏం జరిగిందని ఆరా తీస్తారు. నడ్డా అలా ఏమీ చేయలేదు. దీంతో నడ్డా మానవత్వంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సామాజిక బాధ్యతపై నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శిస్తున్నారు.
దేశంలో రాజకీయం మారినా మానవత్వం, సంస్కృతి విలువలు ఎప్పటికీ అత్యంత ముఖ్యం. అలాంటి సందర్భాల్లో ఎదుటివారిపై స్పందిస్తూ, తక్షణ సహాయం అందించాలి. నడ్డా మాత్ర సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమాజంలో ఉన్నతమైన మానవ విలువల గుర్తింపు మరింత అవసరమని అంటున్నారు.
మానవత్వం మరిచిన జేపీ నడ్డా
గుజరాత్ రాష్ట్రం వడోదరలో జేపీ నడ్డా ప్రసంగం సమయంలో కుప్పకూలి కిందపడి పోయిన సెక్యూరిటీ గార్డ్
కనీసం కనికరం లేకుండా, సెక్యూరిటీ గార్డును పట్టించుకోకుండా ప్రసంగం కొనసాగించిన జేపీ నడ్డా
మనుషులు ఇంత అమానవీయంగా ఉంటారా అంటూ విమర్శిస్తున్న నెటిజన్లు pic.twitter.com/55TT8TEhMA
— Telugu Scribe (@TeluguScribe) November 30, 2025