Chiranjeevi – Venkatesh Song: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా చేయగలిగే దర్శకులు కొందరే ఉన్నారు. అలాంటి వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అతని సినిమాలను చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే… ఈ సినిమా తర్వాత చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకొని చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలపాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో మొదటి సారి చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ ని కూడా కలుపుతున్నాడు. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు.
ఈ సినిమాలో వీళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ మీద డాన్స్ కూడా చేయబోతున్నారు. ఆ సాంగ్ అద్భుతంగా ఉండబోతుందని దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో క్లారిటీ ఇచ్చాడు. ఇక దాంతోపాటుగా వెంకటేష్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతుందని వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అనిల్ చెబుతుండటం విశేషం…
ఇక ఇప్పటివరకు చాలా మంది దర్శకులు వీళ్ళిద్దరినీ కలిపి సినిమా చేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కానీ అనిల్ రావిపూడి మాత్రం వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేయడం అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న భారీ రికార్డులు మొత్తం బ్రేక్ అవ్వబోతున్నాయి అంటూ మరి కొంతమంది అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం…
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతోంది. ఈ మూవీ చిరంజీవికి ఏ రేంజ్ సక్సెస్ ను ఇవ్వబోతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…