https://oktelugu.com/

వయోభారంతో దూరమవుతున్న ఉద్యోగాలు

రాష్ర్టంలో ఉద్యోగాల ప్రకటనతో వయసు పెరిగిపోతోంది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించకుండానే మిగిలిపోతోతున్నారు. దీంతో ఉద్యోగాల లక్ష్యం నెరవేరడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిరుద్యోగుల కోరిక తీరకుండా చేస్తోంది. గవర్నమెంట్ జాబ్ కలగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం కొత్తగా జోనల్ విధానం అమలులోకి తెచ్చింది. దీంతో గత రెండేళ్లుగా సర్వీసు నిబంధనలపై సాధారణ పరిపాలన శాఖ విభాగాల వారీగా సమావేశాలు నిర్వహించినప్పటికి తుదిదశకు రాలేదు. జోన్ల విధానంలో మార్పుల పేరిట మూడున్నరేళ్లుగా నియామక నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 3, 2021 / 02:03 PM IST
    Follow us on

    రాష్ర్టంలో ఉద్యోగాల ప్రకటనతో వయసు పెరిగిపోతోంది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించకుండానే మిగిలిపోతోతున్నారు. దీంతో ఉద్యోగాల లక్ష్యం నెరవేరడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిరుద్యోగుల కోరిక తీరకుండా చేస్తోంది. గవర్నమెంట్ జాబ్ కలగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం కొత్తగా జోనల్ విధానం అమలులోకి తెచ్చింది. దీంతో గత రెండేళ్లుగా సర్వీసు నిబంధనలపై సాధారణ పరిపాలన శాఖ విభాగాల వారీగా సమావేశాలు నిర్వహించినప్పటికి తుదిదశకు రాలేదు.

    జోన్ల విధానంలో మార్పుల పేరిట మూడున్నరేళ్లుగా నియామక నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో అనుమతించిన గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు దాటిన నిరుద్యోగులు అనర్హులవుతున్నారు.గ్రూప్ -1,2,3,4, పోలీసు, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెబుతున్నా నేటికి ప్రకటన రాలేదు. టీఎస్ పీఎస్సీ వద్ద నమోదైన వివరాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న నిరుద్యోగులు రాష్ర్టంలో సుమారు 24 లక్షల మంది ఉన్నారు.

    కొత్త జోన్ల విధానం మేరకు సర్వీసు నిబంధనల సవరణ, పోస్టుల వర్గీకరణ తదితర కారణాలతో 2018 నుంచి టీఎస్పీఎస్సీలో ప్రకటనలు ఆగిపోయాయి. అప్పటికే ఆమోదించిన 1948 గ్రూప్ -1,2,3,4 కేటగిరీల పోస్టులకు సవరణ ప్రతిపాదనలను టీఎస్పీఎస్సీ కి సర్కారు ఇంకా పంపలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన బీజీ, మైనార్టీ సహా ఎస్సీ, ఎస్టీ గురుకుాల్లో సుమారు 6 వేలకు పైగా పోస్టులకు ఆమోదం లభించింది.

    పోలీసు విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు 22 ఏళ్లు, ఎస్సైలకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు. 2018లో ఉద్యోగ ప్రకటన వెలువడగా దాదాపు ఆరు లక్షల మంది పోటీ పడ్డారు. అన్ని విధాల పరీక్షల్లో అర్హత మార్కులు సాధించినా పోలీసు నియామక బోర్డు ఖరారు చేసిన నిర్దేశిత కటాఫ్ మార్కులు అభ్యర్థులకు రాలేదన్న కారణంగా 3,500 పైగా పోస్టులు భర్తీ చేయలేదు. ఈ కటాఫ్ ను కొంత తగ్గించి ఉంటే ఈ ఖాళీలు ఉండకపోయేవని, ఇప్పుడు బ్యాక్ లాగ్ గా మిగిలిపోయాయి. అప్పట్లో పోటీపడి ఉద్యోగాలు పొందలేకపోయిన కొందరి గరిష్ట వయోపరిమితి ఇప్పుడు దాటిపోయింది. దీంతో ఈ ఏడాది పోలీసు శాఖ భర్తీ చేస్తామంటున్న 20 వేల పోస్టులకు వారు అనర్హులవుతారు.