కెరీర్ పడిపోయింది అనుకున్న ప్రతిసారి ‘రాశీ ఖన్నా’ మళ్ళీ నిలబడగలుగుతుంది. కోలీవుడ్ లో ఇప్పటికే రాశీఖన్నా ‘అరణ్‌మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ వంటి సినిమాలు చేస్తోంది.అలాగే కార్తీ ‘సర్దార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ బోల్డ్ బ్యూటీకి మరో బంఫర్ ఆఫర్ తగిలింది. ధనుష్ హీరోగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నాని తీసుకుంటున్నారు.
ధనుష్ చేస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాలో కూడా రాశీఖన్నా ఛాన్స్ కొట్టేసింది అంటే.. హీరోయిన్ గా రాశీఖన్నా స్థాయి పెరిగినట్టే. మొత్తానికి పెద్దగా టాలెంట్ లేకపోయినా హిట్లు లేకపోయినా చూస్తుండగానే తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించేసుకుంది. అయితే ఇలా సడెన్ గా ఛాన్స్ లు పోటెత్తడానికి గల కారణం.. రెమ్యునిరేషన్ ను భారీగా తగ్గించడమేనట.
పైగా ఎక్స్ పోజింగ్ విషయంలో పరిథి దాటాలనే కండిషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిజానికి కెరీర్ స్టార్టింగ్ నుండి అందాలు ఆరబోయడంలో రాశీ ఖన్నా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బొద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాలో, అలాగే గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటిస్తోంది.