JC Prabhakar Reddy : రాయలసీమ రెడ్డప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి వాస్తవాలు మాట్లాడారు. ఈయన అన్న జేసీ దివాకర్ రెడ్డిలాగానే ఈయన కూడా ముక్కుసూటి మనిషి. అందుకే తాజాగా ‘భీమ్లానాయక్’ మూవీని ఏపీలో సీఎం జగన్ సర్కార్ ఏ విధంగా అణగదొక్కుతుందో బట్టబయలు చేశారు. ఏపీలో ఎమ్మార్వోలు, పోలీసులు అంతా కలిసి సినిమా థియేటర్లపై పడ్డారని.. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు మరిచిపోయారని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు పెద్దపీట వేసి మంత్రి కేటీఆఱ్ సైతం హాజరై భరోసా కల్పించారని.. కేటీఆర్ హాజరు కావడంతో పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. ఇగోలతో సీఎం జగన్ తెలుగు సినిమా పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.
చిరంజీవి లాంటి పెద్ద మనిషి మిమ్మల్ని చేతులు జోడించి దీనంగా ప్రాథేయపడలా? అని.. ఆయన్ను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం మాత్రమే అడిగారని.. ఆయన బతుకు దెరువు కోసం కాదని స్పష్టం చేశారు. చిరంజీవిని పైకి తీసుకొచ్చిన ఇండస్ట్రీ కోసం అడిగారని.. కానీ జగన్ వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదన్నారు.
Also Read: కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎంట్రీ కావాలంటే?
జగన్ ను ఎవరూ క్షమించరని.. సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధిస్తే థియేటర్ వద్ద పల్లీలు అమ్మే వ్యక్తి నుంచి లైట్ బాయ్ వరకూ అందరూ నాశనమైపోతారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలానే సినీ పరిశ్రమ పట్ల జగన్ వ్యవహరిస్తే ఏ ఒక్క డైరెక్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి షూటింగ్ చేయరని జేసీ ప్రభాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. చిరంజీవి గారిని అలా చూస్తే ఏడుపొచ్చిందని.. కింది స్థాయి నుంచి పైకి వచ్చిన ఆక్ష్న దీనంగా చేతులు జోడించి అడిగితే చూడడానికి జాలి వేసిందని వాపోయారు.
Recommended Video: