https://oktelugu.com/

అదృష్టం కొద్దీ బెయిల్ వచ్చింది..! మరి బుద్ధి….?

రాజకీయాల్లో విపరీతమైన దుడుకు స్వభావం అసలే పనికిరాదు. అలా ప్రవర్తించిన వారు చివరిదాకా విజయవంతంగా తమ కెరీర్ ను కొనసాగించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. జగన్ లాంటి వ్యక్తే చివరికి ఆచితూచి అడుగులేస్తూ శాంత స్వభావాన్ని అలవర్చుకున్నాడు. ఇక టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురింఛి తెలియ్తని వారుండరు. ఆయన ప్రదర్శించే అహంకారం అంతా ఇంతా కాదు. దివాకర్ ట్రావెల్స్ లో అక్రమాలకు సంబంధించి అరెస్టయి నానా తంటాలు పడి బెయిల్ తెచ్చుకున్నాడు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 19, 2020 / 11:47 PM IST
    Follow us on

    రాజకీయాల్లో విపరీతమైన దుడుకు స్వభావం అసలే పనికిరాదు. అలా ప్రవర్తించిన వారు చివరిదాకా విజయవంతంగా తమ కెరీర్ ను కొనసాగించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. జగన్ లాంటి వ్యక్తే చివరికి ఆచితూచి అడుగులేస్తూ శాంత స్వభావాన్ని అలవర్చుకున్నాడు. ఇక టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురింఛి తెలియ్తని వారుండరు. ఆయన ప్రదర్శించే అహంకారం అంతా ఇంతా కాదు. దివాకర్ ట్రావెల్స్ లో అక్రమాలకు సంబంధించి అరెస్టయి నానా తంటాలు పడి బెయిల్ తెచ్చుకున్నాడు. అంతే బెయి వచ్చి 24 గంటలు కూడా కాకముందే పోలీసులపై అహంకారం ప్రదర్శించి దురుసు ప్రవర్తనతో వెంటనే అరెస్ట్ అయ్యారు.

    ఇక జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇటీవల కరోనా సోకింది. ఈ నేపథ్యంలో అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే న్యాయస్థానం ఇక ఎమర్జెన్సీ కింద బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సారైనా జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారా… శాంతమూర్తిగా మారిపోయి జైలుకు వెళ్లడం తప్పించుకుంటాడా…. అన్నది ఇక్కడి ప్రశ్న. ఇక ఈ సమయంలో “మా పై కుట్ర జరుగుతోంది” అంటూ జేసీ కుటుంబం గగ్గోలు పెట్టడం తెలిసిన విషయమే. 

    Also Read : వైసీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే పెత్తనమెంటో?

    సరే న్యాయస్థానం నుండి ఎలాగో అదృష్టవశాత్తు బెయిల్ పొందారు…. ఇక ఈ హంగామా కు టాటా చెప్పి రెండోసారి జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిదని పలువురు చెబుతున్నారు. అయితే ఆ సంగతేమోగాని పోలీసుల పై దురుసుగా ప్రవర్తించడం మాత్రం ఎవరూ సమర్థించరు. కావాలని అత్యుత్సాహం ప్రదర్శించారా లేదా వారి దూకుడు స్వభావం తెలియకుండానే బయటకు వచ్చి రెచ్చిపోయారో తెలియదు కానీ రెండో సారి జైలుకి పోయి కరోనా ని కొని తెచ్చుకున్నారు. 

    ఇకపోతే టిడిపి వర్గాలు మాత్రం ‘కరోనా సోకేలా చేయాలని ప్రభుత్వం మా జేసీపై కుట్ర పన్నింది’ అంటూ అర్థం పర్థం లేని వాదనకు కూడా తెరలేపారు అనుకోండి అది వేరే విషయం. మరి ఇప్పటికైనా జేసీ జాగ్రత్తగా నడుచుకుంటారా లేదా అన్నదే ఇక్కడ కీలకం.