https://oktelugu.com/

Jayalalithaa: జయలలిత ఆస్తుల అప్పగింత షురూ.. 27 కిలోల బంగారం, 601 కిలోల వెండి.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!

 జయలలిత.. తమిళ రాజకీయాల గురించి తెలిసినవారికి ఈమె పేరు తెలియకుండా ఉండదు. ఫ్రైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న జయలలిత అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. నటిగా, రాజకీయ నాయకురాలిగా మంచి గుర్తింపు ఉంది.

Written By: , Updated On : February 16, 2025 / 12:30 PM IST
Jayalalithaa Assents

Jayalalithaa Assents

Follow us on

Jayalalithaa: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి తెలియనివారు ఉండరు. అలనాటి అందాల నటిగా, తమిళనాడు(Tamilanadu) సీఎంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న జయలలిత.. చివరకు అనారోగ్యంతో మరణించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమె నుంచి స్వాధీనం చేసుకునన వస్తువులను తమకు అప్పగించాలని దాకలైన పిటిషన్‌ మేరకు ప్రభుత్వం వాటిని అప్పగిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు,భూములు, ఆస్తుల పత్రాలు, చీరలు, చెప్పులు సహా ఇతర వస్తువులను తాజాగా అధికారులు ప్రభుత్వానికి అప్పగించారు. మొత్తంగా ఆరు ట్రంకు పెట్టెల్లో బెంగళూరు నుంచి చెన్నైకి తీసుకువచ్చారు వాటిని అప్పగించే పని కూడా పూర్తి చేశారు. బెంగళూరులోని అరప్పన అగ్రహారం జైలులో ఆ వస్తువులను ఉంచారు. తాజాగా న్యాయమూర్తి సమక్షంలో అప్పగించారు.

ముఖ్యమంత్రిగా జైలుకు…
జయలలిత అక్రమ సంపాదనకు సంబంధించి నమోదైన కేసు.. ఆమె అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. 2004లో ఆ కేసును కర్ణాటక(Karnataka)కు బదిలా చేశారు. ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువులు ఇన్నేళ్ల తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోనే ఉంచారు. ఈ కేసులో జయలలిత దోషిగా తేలినా అప్పటికే ఆమె అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆ తర్వాత ఆస్తులు, వస్తువులు తమకు అప్పగించాలని జయలలితకు తామే వారసులమని జె.దీపక్, జె.దీప అనే ఇద్దరు పిటిషన్లు వేశారు. వారి పిలిషన్లు కొట్టేస్తూ స్వాధీనం చేసుకున్న ఆస్తులు, వస్తువులు, అప్పటించారు. ఇక స్వాధీనం చేసుకున్నవాటిలో బంగారం, వెండి, భూమి పత్రాలు, చీరలు, చెప్పులు ఉన్నాయి. అందులో 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు(Dimand Jwellers) ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా 601 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటితోపాటు 10 వేల చీరలు, 750 జతల చెప్పులు ఉన్నాయి. ఇక 1672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, అసలు ఇళ్లకు సంబంధించిన దస్తావేలుజు కూడా ఉన్నాయి. 8,376 పుస్తకాలు, ఇతర సామగ్రి అప్పగిస్తారు.

సుప్రీం ఆదేశాలతో..
ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఆ వస్తువులన్నీ 6 ట్రంకు పెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగళూరు నుంచి చెనై్నకి తీసుకొచ్చిన అధికారులు జడ్జి సమక్షంలో వాటిని బెంగళూరు అధికారులు, తమిళనాడు అధికారులకు అప్పగించారు. అయితే కేసు విచారణ సందర్భంగా.. ఆ వస్తువులను జప్తు చేసుకున్న సమయంలో వాటి విలువ రూ.913.14 కోట్లుగా అధికారులు లెక్కగట్టారు. వాటి విలువ భారీగానే ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కనీసం రూ.4 వేల కోట్లుగా ఉండొచ్చని సమాచారం.

1996 నుంచే..
ఇక జయలలిత 1991–1996 మధ్య తమిళనాడు సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తమిళనాడు అవినీతి నిరోధక అధికారులు కేసు నమోదు చేశారు. తర్వాత ఏసీబీ అధికారులు దాడిచేసి బంగారం, వజ్రాల ఆభరణాలు, వెండి వస్తువులు, ఖరీదైన గడియారాలు, చీరలు, చెప్పులు స్వాధీనం చేసుకున్నారు.