Janasena: జనసేన పార్టీ జనంలోకి వెళుతోంది. ప్రజాసమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గత అక్టోబర్ లో ఏపీలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ ఉద్యమం చేపట్టి రాష్ర్ట వ్యాప్తంగా అస్తవ్యస్తంగా రహదారులను శుభ్రం చేసింది. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కూడా తన గళం వినిపిస్తోంది. రాష్ర్ట ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్యమిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైసీపీని నిలదీసింది. గతంలోనే ఒకరోజు దీక్ష కూడా చేపట్టి తన నిరసన గళం వినిపించింది. విశాఖ ఉక్కును రక్షించాల్సిన అవసరం ఉందని చెబుతోంది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున అన్ని పార్టీల ఎంపీలు తమ నిరసన గళం వినిపించి కేంద్ర ప్రభుత్వాన్ని సైతం నిలదీయాలని సూచిస్తోంది. ఇందులో భాగంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు కొనసాగిస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టా గ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని మేల్కొలపాలని చూస్తోంది.
దీనికిగాను ఇప్పటికే అధినేత పార్టీ నేతలకు సందేశాలు పంపించారు. రాష్ర్ట వ్యాప్తంగా విశాఖ స్టీల్ ఉద్యమాన్ని డిజిటల్ పరంగా విజయవంతం చేయాలని చెబుతున్నారు. నేతలంతా సంయుక్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా నేతల్లో అభిప్రాయభేదాలు పక్కన పెట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.
Also Read: Ticket app: టికెట్ల యాప్ తయారు చేయకుండానే ఈ గోలేంటీ జగనన్న?
పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలని ప్రతిపాదన చేస్తున్నారు. నిరసన, ఆందోళనలకు అందరు మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం విశాఖ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నారు.
Also Read: Journalists: ఆ విషయంలో జర్నలిస్టులకు షాకిచ్చిన జగన్ సర్కార్..!