Janasena: తాటిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడుంటాడు అంటారు.. ఏపీ మంత్రి పేర్ని నాని సినిమా టికెట్ల రేట్లు తగ్గించి ఎంత సర్ధి చెప్పుకుందామని చూసినా ప్రత్యర్థుల నుంచి మాత్రం లాజిక్ లతో ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. సినిమా టికెట్ రేట్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం అదే సమయంలో పేదల కోసం బస్ టికెట్లను ఎందుకు పెంచిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్ కంపెనీ సిమెంట్ ధర, నిత్యావసర సరుకులు,పెట్రోల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదని అడుగుతున్నారు.

ఏపీ సర్కార్ చేసేదే సంసారం.. మిగతా వాళ్లది వ్యభిచారమా? అని ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తాజాగా జనసేన కూడా రంగంలోకి దిగింది. జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఏకంగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానికి ట్వీట్ చేసి కడిగిపారేవారు.
సినిమా టికెట్లు తగ్గించి సమర్థించుకున్న మంత్రికి గట్టికౌంటర్ ఇచ్చారు. ‘ఆర్టీసీ బస్ ఎక్కేవాళ్లు పేదోల్లు కారా?’ అని బొలిశెట్టి సత్యనారాయణ ప్రవ్నించారు. పేదోల్లకి సవగ్గా సినిమా చూపించాలనుకునే రవాణా మంత్రికి సంక్రాంతికి ఆర్టీసీ బస్సు చార్జీలు 50శాతం, ప్రైవేటు బస్సులకు ఏకంగా 100శాతం, 150 శాతం పెంపునకు అనుమతివ్వడం తప్పనిపించలేదా? అని నిలదీశారు.
ఇక వీళ్లకు సిగ్గు, లజ్జలుండవా? అని జనసేన తరుఫున ప్రశ్నించారు. ఓ జాతీయ దినపత్రికలో సినిమా టికెట్ రేట్లు.. ఏపీలో బస్సుల రేట్లను పోలుస్తూ ప్రచురించిన వ్యాసాన్ని దానికి జోడించారు. బొలిశెట్టి నేరుగా ఏపీ మంత్రి పేర్నినానికి సంధించిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టేలా ఉంది.
ఆర్టీసీ బస్ ఎక్కేవాల్లు పేదోళ్ళు కారా?
పేదోల్లకి సవగ్గా సినిమా సూపించాలనుకొనే రవాణా మంత్రికి, సంక్రాంతికి ఆర్టీసీ బస్ చార్జీలు 50%, ప్రైవేట్ బస్సులకు ఏకంగా 100%~ 150% పెంపుకి అనుమతివ్వడం తప్పనిపించలేదా?
వీళ్ళకి సిగ్గు, లజ్జలుండవా?#JSPForNewAgePolitics https://t.co/57bo1ZLL3n pic.twitter.com/8l7ksGHEHf
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) January 10, 2022