https://oktelugu.com/

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ధీమాకు అసలు కారణం అదే?

Pawan Kalyan: రాజకీయాల్లో పౌరుషాలకు తావులేదు.. వ్యూహాలే ఉంటాయంటూ జనసేన పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గతం కంటే భిన్నంగా ఆయన ఆలోచన సరళి మారినట్టు కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. గతం కంటే జనసేన బలంపై కూడా పూర్తి కాన్ఫిడెన్స వచ్చినట్టు కనబడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తమకు 70 సీట్లు ఖాయమన్న నిర్థారణకు వచ్చింది. అయితే ఎవరి బలంపై వారికి అంచనాలుంటాయి. కానీ జనసేన ఆవిర్భావం నుంచి […]

Written By:
  • Dharma
  • , Updated On : May 12, 2022 12:32 pm
    Follow us on

    Pawan Kalyan: రాజకీయాల్లో పౌరుషాలకు తావులేదు.. వ్యూహాలే ఉంటాయంటూ జనసేన పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గతం కంటే భిన్నంగా ఆయన ఆలోచన సరళి మారినట్టు కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. గతం కంటే జనసేన బలంపై కూడా పూర్తి కాన్ఫిడెన్స వచ్చినట్టు కనబడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తమకు 70 సీట్లు ఖాయమన్న నిర్థారణకు వచ్చింది. అయితే ఎవరి బలంపై వారికి అంచనాలుంటాయి. కానీ జనసేన ఆవిర్భావం నుంచి సీట్ల అంచనాలు అంటూ ఎప్పుడూ ప్రకటించలేదు. పవన్ కూడా ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. అలాగని ఓటు వేయని ప్రజలను కూడా ఏనాడూ దూషించలేదు.

    pawan kalyan

    janasena chief pawan kalyan

    సమస్యలు తెరపైకి వచ్చినప్పుడు మాత్రం తాము అండగా ఉంటామని ముందుకొస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను, తితలీ తుపాను సమయంలో అతలాకుతలమైన సిక్కోలు వాసులను ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల విషయంలో వారికి అండగా నిలబడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలో సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కార మార్గంపై ద్రుష్టిపెట్టారే తప్ప అధికారం కోసం అర్రులు చాచలేదు. తాజాగా ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.30 కోట్ల నిధిని ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3000 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తున్నారు. కౌలురైతు భరోసా యాత్ర ఒక ఉద్యమంలా సాగుతోంది. అయితే ఇటు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అటు పార్టీ బలోపేతం చేయడంపైనా పవన్ ద్రుష్టిసారించారు. ప్రజల్లో కూడా పార్టీ పట్ల ఆదరణ పెరిగింది. అందుకే గతంలో ఎన్నడూలేని విధంగా పార్టీపై శ్రేణుల్లో సైతం కాన్ఫిడెన్స్ పెరిగింది. 175 సీట్లు ఉంటే అన్ని సీట్లు మావే అన్నట్టు భావించడం లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని మాత్రమే జనసేన అంచనా వేసుకుంటోంది.

    Also Read: Gadapa Gadapaku YCP: గడగడపకు వెళితే గట్టి దెబ్బే.. వైసీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు

    ఆ తప్పిదం జరగకుండా..
    అయితే 2014 ఎన్నికల్లో చేసిన తప్పిదాలకు ఇప్పటికీ జనసేన మూల్యం చెల్లించుకుంటూ వస్తోంది. నాడు ఏ పార్టీకి మద్దతు పలకకుండా ఉండి ఉంటే అధినేతపై దత్తపుత్రుడు అన్న వ్యాఖ్యలు వచ్చి ఉండేవి కావని.. ప్లెయిన్ ఇమేజ్ తో 2024 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చి ఉండేవారమని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఒక వేళ టీడీపీతో పొత్తు ఉన్నా..ఆ పార్టీకి తాము అనుబంధంగా ఉండబోం అని కూడా తేల్చి చెబుతోంది. అంటే తాము బలంగా ఉన్న శక్తి అని చాటేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. అదే అభిప్రాయాన్ని సుస్థిరం చేసేందుకు ఇష్టపడుతోంది కూడా! అంటే రానున్న ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ కన్నా జనసేన ఫుల్ క్లారిటీతో ఉంది. బలమైన రాజకీయ పక్షంగా మారాని భావిస్తోంది. అదే సమయంలో మారిన పవన్ పంథా చూసి రాజకీయ విశ్లేషకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు ఉన్న సమస్యలను ఎజెండాగా చేసుకొని పవన్ పోరాడుతున్న తీరు.. సొంతంగా నిధి కేటాయించి బాధిత కుటుంబాలకు అందిస్తున్న తీరుపై అభినందిస్తున్నారు. ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉన్న ద్రుష్ట్యా పవన్ బలం మరింత పెరగనుందని విశ్లేషిస్తున్నారు.అదే జరిగితే చంద్రబాబు పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితులు సైతం రానున్నాయని అంచనా వేస్తున్నారు. జనసేన శ్రేణులు సైతం ఇదే అంచనాతో ఉన్నాయి.

    pawan kalyan

    janasena chief pawan kalyan

    ఆ వర్గాల అభిమానం
    మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పుడున్న ప్రత్యామ్నాయం జనసేన కనిపిస్తోంది. ఆయా వర్గాల్లో సైతం జనసేనపై చర్చ ప్రారంభమైంది. పీఆర్సీపై పోరుబాట పట్టినప్పుడు ముందుగా మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణే. అటు పలు వేదికల వద్ద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయసమ్మతమైన డిమాండ్లను ప్రస్తావించారు. తాను కూడా ఉద్యోగి కొడుకునేనని గుర్తుచేశారు. ఉద్యోగుల కష్టాలను సైతం ప్రస్తావించారు. దీంతో ఆయా వర్గాల్లో అభిమానాన్ని చూరగొన్నారు.

    Also Read:Former Minister Narayana: నారాయణ అరెస్ట్ ఎపిసోడ్ లో ప్రభుత్వానికి చుక్కెదురు
    Recommended Videos
    జనసైనికులు తప్పకుండా చూడవలసిన వీడియో | Pawan Kalyan Heart Touching Moments With Farmers | Ok Telugu
    Guntur Farmer Demands CM Jagan || AP Public Talk on Jagan Schemes || 2024 Elections || Ok Telugu
    కొట్టుకొచ్చిన బంగారు గోపురం | Gold Painted Chariot at Srikakulam Beach | Asani Cyclone | Ok Telugu

    Tags