Homeజాతీయ వార్తలుPawan Kalyan On Kondagattu Temple: జనమా.. ‘జన’ సైన్యమా.. పవన్‌కు ‘కొండంత’ అభిమానం..

Pawan Kalyan On Kondagattu Temple: జనమా.. ‘జన’ సైన్యమా.. పవన్‌కు ‘కొండంత’ అభిమానం..

Pawan Kalyan On Kondagattu Temple: నాయకుడు జనంలో నుంచే పుట్టుకొస్తాడు.. అలా వచ్చిన వాడే నిజమైన నాయకుడవుతాడు.. మన తెలుగు ప్రజలకు అభిమానం చాలా ఎక్కువ. ఒక్కసారి అభిమానించారంటే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ప్రాంతీయ భేదం చూడరు. కుల మతాల గురించి ఆలోచించరు. జన సేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రాష్ట్రాలు, ప్రాంతీయ భేదాలు చూడకుండా.. తెలంగాణ ప్రజలు ‘కొండంత’ అభిమానం చాటుకున్నారు. కొండగట్టులో ఆయనకు చూసేందుకు వచ్చిన జనాన్ని చూస్తే.. జనమా.. జన సైన్యమా అని అనిపించక మానదు. రాజకీయంగా కాకుండా కేవలం తన ఇష్టదైవాన్ని పూజించేందుకు వచ్చిన అభిమాన నేతను చూసేందుకు భారీగా జనం తరలిరావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Pawan Kalyan On Kondagattu Temple
Pawan Kalyan On Kondagattu Temple

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం కొండగట్టులోని ఆంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. కొండగట్టులో పవన్‌ కళ్యాణ్‌ తన ప్రచార రథమైన వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. దీంతో వారాహి ఎన్నికల సమరానికి సిద్ధమైంది. పవన్‌ కొండగట్టు పర్యటన నేపథ్యంలో భారీగా అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు కొండగట్టులో హంగామా చేశారు.

-జనసేన జోష్‌..
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో కొండగట్టులో మంగళవారం విపరీతమైన రద్దీ కనిపించింది. పవన్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన నేత కోసం మంగళవారం తెల్లవారుజాము నుంచే కొండగట్టులో మకాం వేశారు. జనసేన అధినేత పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టులోనే కాకుండా ధర్మపురిలో నారసింహ యాత్రను ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ కూడా ముమ్మరంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Pawan Kalyan On Kondagattu Temple
Pawan Kalyan On Kondagattu Temple

-గజమాలతో సత్కరించి.. పూలు చల్లుతూ..
హైదరాబాద్‌ నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి బయలుదేరిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌కు హకీంపేటలో ట్రాఫిక్‌ ఇబ్బంది ఏర్పడింది. రోడ్డుపై లారీ రిపేర్‌ కావడంతో హకీంపేట వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు ట్రాఫిక్‌ని క్లియర్‌ చేసి పవన్‌ను అక్కడి నుండి పంపించారు. ఆపై మార్గమధ్యలో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ గజమాలతో క్రేన్‌ సాయంతో పవన్‌ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ కొండగట్టుకు స్వాగతించారు. అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పలికారు.

Pawan Kalyan On Kondagattu Temple
Pawan Kalyan On Kondagattu Temple

– ఆలయంలో ప్రత్యేక పూజలు..
ఇక కొండగట్టు చేరుకున్న పవన్‌కళ్యాణ్‌ కు ఆలయ అర్చకులు స్వాగతం తెలిపారు. ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామికి జనసేనాని వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజాధికాలు నిర్వహించారు. తర్వాత వారాహికి ప్రత్యేక పూజలను పూర్తి చేశారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.

Pawan Kalyan On Kondagattu Temple
Pawan Kalyan On Kondagattu Temple

-జనసేన నేతలతో సమావేశం
పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు కొండగట్టుకు చేరుకున్నారు. వారాహి వాహనానికి పూజల అనంతరం పవన్‌ కళ్యాణ్‌ నాచుపల్లి సమీపంలోని కొడిమ్యాల మండల పరిధిలోని బృందావన్‌ రిసార్ట్‌ లో తెలంగాణ ప్రాంత జనసేన నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీపై దిశానిర్దేశం చేశారు. ఇక నేటి పూజల తరువాత పవన్‌∙కళ్యాణ్‌ ఎన్నికల ప్రచార రథం ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోనుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper