https://oktelugu.com/

బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేశారా.. లేదంటే లక్షల్లో నష్టం..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం జన్ ధన్ ఖాతాల ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం కల్పించింది. కేంద్రం నిర్ణయం వల్ల పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. Also Read..ఆధార్ కార్డులో వయస్సు మార్చుకున్న వాళ్లకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 11, 2020 3:32 pm
    Follow us on

    jandhan account
    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం జన్ ధన్ ఖాతాల ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం కల్పించింది. కేంద్రం నిర్ణయం వల్ల పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

    Also Read..ఆధార్ కార్డులో వయస్సు మార్చుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్..?

    అయితే జన్ ధన్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా జన్ ధన్ ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేసుకోకపోతే వాళ్లు 1,30,000 రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లకు పలు ప్రయోజనాలను అందిస్తోంది. జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లు రూపే ఏటీఎం కార్డును పొందవచ్చు. ఈ అకౌంట్లపై కేంద్రం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తోంది.

    జన్ ధన్ ఖాతాకు ఆధార్ లింక్ చేసిన వాళ్లు రూపే క్రెడిట్ కార్డును కలిగి ఉంటే వాళ్లకు లక్ష రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, 30,000 రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తోంది. జన్ ధన్ బ్యాంక్ ఖాతాను ఆరు నెలలు వినియోగించిన వాళ్లు 5,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. ఏ బ్యాంకులోనైనా జన్ ధన్ ఖాతాను సులభంగా ఓపెన్ చేయవచ్చు.

    Also Read..రూ.1500 పై వచ్చిన ఈ వదంతులు నమ్మకండి!

    ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు సైతం జన్ ధన్ ఖాతాలను పొందే అవకాశం కల్పిస్తున్నాయి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర గుర్తింపు కార్డులు ఉంటే సులభంగా జన్ ధన్ ఖాతాను తెరవవచ్చు. జన్ ధన్ ఖాతా ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో ఈ ఖాతాను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.