Kashmir: దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం కొత్తగా కార్గో సేవలు విస్తరిస్తోంది. దీని ద్వారా ఉగ్రమూలాలు ఎక్కడ ఉన్నా కనిపెట్టి వాటిని భూస్థాపితం చేసే పనిలో పడింది. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో అనుభవం ఉన్న వారితో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్వోజీ) సిద్ధం చేస్తోంది. జమ్ము కశ్మీర్ లో ఉగ్రదాడులు పెరగడంతో ఎస్పీ స్థాయి అధికారి హోదాలో ఇఫ్తికార్ తాలిబ్ కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు.

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఎస్ వోజీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంటిలిజెన్స్ సేకరణలో చురుగ్గా వ్యవహరిస్తోంది. జమ్ము కశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలు రూపుమాపేందుకు నడుం బిగించింది. అధికారులందరు బృందాలుగా విడిపోయి ఉగ్రమూకలను కనిపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వారి ఆచూకీ గుర్తించి వారిని ఏరివేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
జమ్ము కశ్మీర్ లో ప్రతి జిల్లాలో కార్గో బృందాలు ఉగ్రవాదుల కోసం వేటాడుతున్నాయి. ఎస్ వోజీ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లకు వినియోగించే వాహనం కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. 360 డిగ్రీల్లో కూడా కనిపించేలా వాటిని ఏర్పాటు చేశారు. ఉగ్రవాదంలోకి వెళ్లే యువతను గుర్తించి వారిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
యువత సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర వాదంవైపు ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. దీంతో వారి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారిని మళ్లీ తీసుకొచ్చేందుకు ఎస్ వోజీ పలు కోణాల్లో ఆరా తీస్తోంది. తల్లిదండ్రులకు సైతం వారి సమాచారం ఇస్తూ వారిని తీసుకురావాలని సూచిస్తోంది. ఇందుకుగాను ప్రత్యేకంగా ఓ టీంను తయారు చేసింది.