Jamathe islami : జమ్ము-కశ్మీర్ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ పోటీ.. అయితే నేరుగా కాకుండా.. ఇలా..

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో జమాతే ఇస్లామీ తన మాజీ సభ్యుల్లో ముగ్గురిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపింది. అయితే, వీరు పోటీ చేయడాన్ని సజాద్ లోన్ స్వాగతించడం కొసమెరుపు.

Written By: Mahi, Updated On : August 27, 2024 3:13 pm

Jamathe islami Party

Follow us on

Jamathe islami : ఆర్టికల్ 370 తర్వాత జమ్ము కశ్మీర్ లో మొదటి సారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిషేధిత సంస్థ జమాతే ఇస్లామీ (జేఈఐ)కి అనుమతి లేదు. దీంతో సదరు సంస్థ తమ స్వతంత్ర అభ్యర్థులుగా సంస్థ సభ్యులను బరిలోకి దింపింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 18న నిర్వహించే మొదటి దశ పోలీంగ్ లో పాల్గొనేందుకు ముగ్గురు జేఈఐ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. అందులో పుల్వామా నియోజకవర్గం స్వతంత్ర జమాతే ఇస్లామీ అభ్యర్థి తలాత్ మజీద్ మంగళవారం (ఆగస్ట్ 27) నామినేషన్ దాఖలు చేశారు. జమ్ము కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (జేకేపీసీ) చీఫ్ సజాద్ గనీ లోన్ సోమవారం జమాతే ఇస్లామీ (జేఈఐ) సభ్యులు బాధితులు అని పేర్కొంటూ వ్యాఖ్యనించారు. వారు జైలుకు వెళ్లారని, 2002, మే 21న శ్రీనగర్ లో హత్యకు గురైన తన తండ్రి అబ్దుల్ ఘనీ లోన్ తో జైలు గోడలను పంచుకున్నారని చెప్పారు. తాము (జమాతే ఇస్లామీ అనుబంధ సంస్థలు) జైలు శిక్ష, చిత్రహింసలు, అత్యంత భయానక జీవితం అనుభవించామని లోన్ చెప్పారు. ‘నొప్పి అంటే ఏమిటో వారికి తెలుసు అందువల్ల ఇతరుల బాధను అర్థం చేసుకునేందుకు మంచి స్థితిలో ఉన్నారు’ అన్నారు. ‘1989 అనంతర కాలంలో జరిగిన హింసాకాండలో ప్రజలను జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేసిన, చంపిన వారు ప్రధాన స్రవంతిలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు’ అని లోన్ ఎక్స్ పోస్ట్ లో రాశారు.

ఈ వీఐపీలు ఒక్కతాటిపైకి వచ్చి బాధితులుగా నటిస్తున్నారు. నిజమైన బాధితుడు ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించినప్పుడల్లా, ఈ వీఐపీ ముఠా దుష్ప్రచారం చేస్తుంది.’ అని లోన్ ట్వీట్ చేశారు. విజేతలు తమకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నటించడం బాధితులకు పెద్ద అవమానం. తమను హింసాత్మకంగా అక్కడికి పంపిన విజేతలు తమ కోసం మాట్లాడుతున్నట్లు నటిస్తే సమాధుల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారు నిరసన తెలపడానికి లేవలేరన్నారు. ‘జమాత్ ఇస్లామితో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే వార్త నిజమైతే నేను చాలా సంతోషిస్తున్నాను’ అని లోన్ అన్నారు.

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు మాజీ మిలిటెంట్లు, వేర్పాటువాదులు కలిసి ఒక రాజకీయ గ్రూపుగా ఏర్పడ్డారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ బృందంలో జైషే మహ్మద్ మాజీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపింది. ఈ బృందానికి ‘తహ్రీక్-ఇ-అవామ్’ అని నామకరణం చేసినట్లు మీడియా చెప్పింది.

నిషేధం ఎత్తివేయాలి: మెహబూబా ముఫ్తీ
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిషేధిత సంస్థ సుముఖత వ్యక్తం చేయడం మంచి పరిణామమని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆదివారం (ఆగస్టు 25) అన్నారు. జేఈఐపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు.

‘భారత ప్రభుత్వం జైషే మహ్మద్ పై నిషేధాన్ని ఎత్తివేయాలని నేను కోరుతున్నా. ర్యాలీలు నిర్వహించే, మసీదులపై రాళ్లు రువ్వే, ముస్లింలను చంపే వారి పేర్లను నేను చెప్పదలచుకోలేదు, అలాంటప్పుడు విద్యా రంగానికి ఎంతో దోహదం చేసిన జైషే మహమ్మద్ పై నిషేధం ఎందుకు..? 2014 వరదలు, కొవిడ్ బాధితులను ఆదుకున్నారా..? శ్రీనగర్ లో ముఫ్తీ విలేకరులతో మాట్లాడారు.

జైలులో ఉన్న షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ ను ఎన్నుకోవడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర కశ్మీర్ ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ సెంటిమెంట్ కు ఓటు వేశారని ఆమె పేర్కొన్నారు. ఉత్తర కష్మీర్ లోని కుప్వారాలోని లాంగేట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రషీద్ జమ్ము కశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు మద్దతు పలికారు.

జమాతే ఇస్లామీ గురించి..
జమాత్ అనేది ఇస్లామిక్, పాకిస్తాన్ అనుకూల సంస్థ, ఇది గతంలో హిందువులపై హింస చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతుడైనప్పటి నుంచి దేశం హిందువులు, ఇతర జాతి మైనార్టీపై హింసాకాండలో కూరుకుపోయింది. 2001లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)-జమాత్ కూటమి దేశ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు, వారి కార్యకర్తలు దేశ మైనారిటీలపై హింసాకాండకు తెరలేపినప్పుడు కూడా జమాత్ ఇలాంటి హింసకు నాయకత్వం వహించింది. వందలాది మంది మహిళలపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడింది.