తెలంగాణలో ఇప్పుడు కొత్త పార్టీల చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్పుడు కొత్తగా మరో అంశాన్ని తెరపైకి తెస్తున్నారు ఆయా పార్టీల నేతలు. తెలంగాణ రాజకీయ ప్రయోగశాలగా.. రాజకీయ పర్యాటక ప్రాంతంగా మారిందని.. తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నేతలు ఉసూరుమంటున్నారు. షర్మిల రాజకీయ పార్టీపై అనేక మంది వివిధ పార్టీల నేతలు స్పందించారు. చాలా మంది లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదంటున్నా కొంత మంది మా తెలంగాణ పరిస్థితి ఇలా అయిందేంటని నిర్వేదంలో ఉన్నారు.
Also Read: మజ్లిస్ బెట్టు..: తెరపైకి రొటేషన్ పద్ధతి
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ కోవాలో చేరిపోయారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన తనదైన శైలిలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో ఆయన మార్క్ ఆయనది. ఆయన షర్మిల పార్టీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తెలంగాణ పొలిటికల్ టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందన్నారు. ఇవ్వాల షర్మిల, రేపు జూనియర్ ఎన్టీఆర్, మరొకరో వస్తారని నిర్వేదం వ్యక్తం చేశారు.
అయితే.. జగ్గారెడ్డి నోటి వెంట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం అనూహ్యమేమి కాదు. టీడీపీ సోషల్ మీడియా సర్కిల్స్‌లో చాలా కాలంగా ఇదే చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ బాధ్యతల్ని జూనియర్ ఎన్టీఆర్‌కు ఇస్తారన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే.. ఎన్టీఆర్‌కు.. బాలకృష్ణ, చంద్రబాబుతో తీవ్రమైన విబేధాలున్నాయని, వారికి ప్రస్తుతం మాటల్లేవన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ సందర్భంలో ఇబ్బంది లేకుండా ఉండటానికి జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణ బాధ్యతలిస్తారని కూడా చెప్పుకున్నారు.
Also Read: విశాఖలో న్యూ ఎంట్రీ..: ఇప్పటికే పోస్కో కంపెనీతో ఒప్పందం
ఆ విషయం జగ్గారెడ్డి దృష్టిలో పడిందేమో కానీ.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగ్గారెడ్డి సన్నిహితుడు. టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆయన వైఎస్ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆయన షర్మిల విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. బీజేపీ డైరెక్షన్‌లోనే ఆమె పార్టీ పెడుతున్నారని ఆయన చెప్పుకొస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్