ఆనందయ్య.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లాడుతున్న కరోనా మందును వనమూలికలతో తగ్గిస్తున్న ఈయన ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. లక్షలు, కోట్లు ఖర్చు చేసినా ఇప్పుడు కరోనాకు మందు లేదు. దేశంలో వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. కానీ వనమూలికలతో కరోనాను తగ్గిస్తున్న ఆనందయ్య ఆయుర్వేద మందును పునరుద్దరించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఏపీ ప్రభుత్వం పరిశోధన పేరిట ఆపేసిన ఈ ఆనందయ్య మందును పునరుద్దరించాలని ఇప్పటికే హైకోర్టులో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి.
తాజాగా ఆనందయ్యకు మద్దతుగా ప్రముఖ తెలుగు నటుడు జగపతిబాటు ట్వీట్ చేయడం విశేషం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా మందు పంచుతూ రోగుల ప్రాణాలు కాపాడుతున్న ఆనందయ్య ఆయుర్వేద మందుకు జగపతి బాబు మద్దతు ప్రకటించారు.
తాజాగా జగపతిబాబు ట్వీట్ చేశాడు. ‘‘‘ఆనందయ్య మందే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది. ఆనందయ్య గారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. ఆ రకంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి’’ అని జగపతి బాబు ట్వీట్ లో పేర్కొన్నారు.
Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS
— Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Jagapathibabu supports anandayya medicine
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com