Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: రాజ్యసభ ఎన్నికలపై జగన్ వ్యూహం అదే

CM Jagan: రాజ్యసభ ఎన్నికలపై జగన్ వ్యూహం అదే

CM Jagan: రాజ్యసభ ఎన్నికల విషయంలో జగన్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు.గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను గుణపాఠంగా చేసుకున్నారు. అందుకే ఈసారి ఆ తప్పిదం జరగకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను వైసిపి ప్రకటించింది. వై వి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావుల పేర్లను ఖరారు చేశారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలను, మరో ఎస్సీ నేతను ఎంపిక చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎస్సీ నేతను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తొలుత జగన్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులకు టిక్కెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు, కేసులు ఉన్న విజయానంద రెడ్డికి టికెట్ కట్టబెట్టారు. ఈ కారణంగానే శ్రీనివాసుల కు రాజ్యసభ సీటు ఇస్తారని అంతా భావించారు. కానీ చివరి క్షణంలో కడప జిల్లా రాజంపేటకు చెందిన రఘునాథ్ రెడ్డికి కేటాయించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించడంతో.. ఆయన సోదరుడికి రాజ్యసభ ఇచ్చి సంతృప్తి చేస్తున్నారు.

అయితే గొల్ల బాబూరావు ఎంపిక వ్యూహాత్మకమేనని తేలుతోంది. సిట్టింగ్లను మార్చారు. కొందరికి స్థానచలనం కల్పించారు. మరి కొందరిని పక్కన పెట్టారు. ఇలా పక్కన పెట్టిన వారిలో ఎస్సీ ఎమ్మెల్యేలే అధికం. వారంతా వైసిపి పైన ఆగ్రహంగా ఉన్నారు. జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరంతా అనుకుంటే మాత్రం రాజ్యసభ ఓటింగ్ లో తమ ప్రతాపాన్ని చూపగలరు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా ఎస్సీ అభ్యర్థిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గొల్ల బాబూరావు ఒకసారి తన అసంతృప్తిని ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట వ్యక్తం చేశారు కూడా. మంత్రివర్గం లోకి తీసుకోకపోవడంతో తీవ్ర కలత చెందిన జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో గొల్ల బాబూరావు కు పాయకరావుపేట టిక్కెట్ ను నిరాకరించారు. అనూహ్యంగా రాజ్యసభకు ఎంపిక చేశారు. మరోవైపు టిడిపి దళిత అభ్యర్థిని రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టికెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థి వైపు మొగ్గుచూపితే బాబూరావు ఓడిపోవడం ఖాయం. అదే జరిగితే దళిత అభ్యర్థిని ఓడించారని ప్రచారం ఒకవైపు.. గొల్ల బాబురావు ఇంటికి పంపించామని మరోవైపు వైసీపీ సంతృప్తి పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version