Tirupati Politics: తిరుపతి సీటుపై జగన్ ప్లాన్ అదే

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లోకరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిని బరిలో దించాలని భావిస్తున్నారు. అయితే హై కమాండ్ నుంచి ఆయనకి గ్రీన్ సిగ్నల్ లభించలేదు.

Written By: Dharma, Updated On : August 9, 2023 5:25 pm

Tirupati Politics

Follow us on

Tirupati Politics: ఏపీలో కీలక నియోజకవర్గాల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం ఒకటి. ఇక్కడి నుంచి ఎంతోమంది హేమాహేమీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టిటిడి చైర్మన్ గా కూడా ఇటీవల ఎంపికయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కేటాయించారని టాక్ నడుస్తోంది.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లోకరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిని బరిలో దించాలని భావిస్తున్నారు. అయితే హై కమాండ్ నుంచి ఆయనకి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఇంతలో టీటీడీ చైర్మన్ గా అవకాశమిచ్చారు. అయితే దీని వెనుక పెద్ద కసరత్తే జరిగినట్లు తెలిసింది.వచ్చే ఎన్నికల్లో తిరుపతి సీటు ఎలాగైనా గెలవాలన్నదే వైసిపి వ్యూహంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 700 ఓట్లతో మాత్రమే కరుణాకర్ రెడ్డి గట్టెక్కారు. ఈసారి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయట.

ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఎక్కువ. అటు తర్వాత యాదవులు కూడా అధికంగా ఉన్నారు. అందుకే ఈసారి బీసీ వర్గాలను బరిలో దించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మేయర్ గా డాక్టర్ శిరీష యాదవ్ ఉన్నారు. ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. అప్పుడే టిడిపి పై నెగ్గగలమని.. లేకుంటే కష్టమని విశ్లేషిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి కడితే మాత్రం తిరుపతి సీటు వైసీపీకి టైట్ గా మారుతుంది. గత ఎన్నికల్లో జనసేన ఇక్కడ 12 వేల ఓట్ల ను కైవసం చేసుకుంది. అందుకే ఈసారి జగన్ ప్లాన్ మారుస్తున్నారు. టిడిపి, జనసేన కు పట్టున్న యాదవ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరిలో దించాలని మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి కుమారుడికి తిరుపతి మేయర్ సీటు కట్ట పెడతారని ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ సెట్ చేసిన తర్వాతే కరుణాకర్ రెడ్డికి టీటీడీ పీఠం అప్పగించారని తెలుస్తోంది.