Homeఆంధ్రప్రదేశ్‌AP Capital Issue: సీబీఐ కేసులో జగన్ లాయరే సుప్రీం కోర్టు సీజేఐ...ఏపీ రాజధాని కేసులపై...

AP Capital Issue: సీబీఐ కేసులో జగన్ లాయరే సుప్రీం కోర్టు సీజేఐ…ఏపీ రాజధాని కేసులపై టీడీపీ నేత డౌట్స్?

AP Capital Issue: ఏపీలో అమరావతి రాజధాని ఇష్యూ పతకస్థాయికి చేరుకుంది. అమరావతికి మద్దతుగా భూములిచ్చిన రైతులు అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు అమరావతి రాజధానిపై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏడు నెలల తరువాత ఏపీ సర్కారు సుప్రీం కోర్టు తలుపుతట్టింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తొలుత మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం బిల్లు పెడుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు సమావేశంలోరాజధాని అంశంపై ఏపీ సీఎం జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. నేరుగా మూడు రాజధానులని వ్యాఖ్యానించకున్నా.. పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అభిమతమని తేల్చేశారు. మూడు రాజధానులనే సంకేతాలిచ్చారు. అటు తరువాత మూడు రాజధానులకు మద్దతుగా బిల్లు ప్రవేశపెడతారని అంతా భావించారు. కానీ ఏపీ సర్కారు అనూహ్యంగా సుప్రీం కోర్టులో ప్రత్యేక పిటీషన్ వేసింది. అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుమారు ఏడు నెలల తరువాత సవాల్ చేసింది. దీంతో సుప్రీం కోర్టులో రాజధాని కేసు విచారణ ఆసక్తిగా మారింది. తీర్పు ఎలా ఉండబోతుందున్న ఉత్కంఠ నెలకొంది.

AP Capital Issue
JAGAN

ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు అమరావతి రాజధానిపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకి లేదంటూ తేల్చిచెప్పింది. ఆరు నెలల్లోగా సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలిచ్చింది. అయితే కోర్టులో చుక్కెదురు కావడం ఖాయమని న్యాయనిపుణులు సలహా ఇచ్చిన నేపథ్యంలో అంత కంటే ముందుగానే అసెంబ్లీలో మూడు రాజధానుల మద్దతు బిల్లును వెనక్కితీసుకుంది.

Also Read: Minister Roja vs Janasena: నగరిలో హైటెన్షన్.. మంత్రి రోజాకు జనసేన నేతల సవాల్

అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. అటు సుప్రీం కోర్టును ఆశ్రయించలేదు. సమయం చాలదని ఒక సారి, నిధులులేవని మరోసారి పిటీషన్లు వేసి కాలం వెళ్లదీసింది. ఆగస్టు 3 తో హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా ఒక్క పని అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే వచ్చే ఎన్నికల వరకూ రాజధాని అంశాన్ని అలాగే ఉంచాలని ప్రభుత్వ భావనగా తెలుస్తోంది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం రాజధానిని తాత్సారం చేస్తూ వస్తుందన్న టాక్ అయితే ఉంది.

AP Capital Issue
JAGAN

అయితే ఈ ఏడు నెలలు సుప్రీం కోర్టుకు వెళ్లకపోవడానికి మరో కారణం ఉన్నట్టు బయట టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ఉన్నారు. ఆయన్ను ఏపీ సీఎం జగన్ వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించక ముందు..సీఎం జగన్ కేంద్రానికి జస్టిస్ రమణకు వ్యతిరేకంగా లేఖలు రాశారు. అప్పట్లో అవి దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలో సీజేఐగా రమణ ఉన్న సమయంలో రాజధానిపై ఆశ్రయిస్తే చుక్కెదురు కావడం ఖాయమని భావించే ఏడు నెలలు జాప్యం చేస్తూ వచ్చారన్న ప్రచారం అయితే ఉంది.

అలాగే తాజాగా సుప్రీం కోర్టుకు వెళ్లడానికి…పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులే తమ అభిమతమని గట్టిగా చెప్పడానికి మరో కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అదే సీజేఐ లలిత్ కుమార్. ఈయన జగన్ సీబీఐ కేసులు వాదించిన లాయర్. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉండడంతో జగన్ సర్కారు ధైర్యం చేసిందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ బయటపెట్టడం సంచలమైంది. వచ్చే ఎన్నికల వరకూ రాజధానిని రకరకాల కారణాలుచూపుతూ పెండింగ్లో పెట్టి జగన్ సర్కారు రాజకీయంగా లబ్ధి పొందేందుకు చూస్తుందన్న టాక్ అయితే బయట విస్తృతంగా వినిపిస్తోంది.

Also Read: Kerala Bride Wedding Photoshoot: ఈ నవ వధువు పెళ్లి ఫోటోషూట్ పినరయి విజయన్ కు మొట్టికాయ వేసింది

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version