Homeఆధ్యాత్మికంJagannath Rath Yatra 2025: 12 రోజులపాటు ఉత్సవాలు.. రథం కదిలితే వరుణుడు.. జగన్నాథ రథయాత్ర...

Jagannath Rath Yatra 2025: 12 రోజులపాటు ఉత్సవాలు.. రథం కదిలితే వరుణుడు.. జగన్నాథ రథయాత్ర విశేషాలు ఇవే!

Jagannath Rath Yatra 2025: పూరీ జగన్నాథ రథయాత్రకు( jagannadharath Yatra ) సర్వం సిద్ధం అయింది. రేపటి నుంచి ఒడిస్సా లోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కానుంది. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ రథయాత్ర సొంతం. ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేం. అంతటి ఘన కీర్తి ఉన్న ఈ రథయాత్ర అంతా విశేషమే. శ్రీకృష్ణుని అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నాయి. హిందూ వ్యవస్థలోనే అత్యంత ముఖ్యమైన పండుగల్లో ప్రధానమైనది జగన్నాథ రథయాత్ర. సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఈ రథయాత్ర సొంతం. లక్షలాదిమంది భక్తుల జయ జయ ధ్వానాల నడుమ రథయాత్ర ప్రారంభం అవుతుంది.

Also Read: జగన్ ఐదు వారాల వ్రతాలు చేస్తున్నాడా? ఏబీఎన్ వెంకటకృష్ణ సూపర్ సిక్స్ అమలు పై ఇలానే మాట్లాడగలడా?

* రకరకాల పేర్లతో..
పూరీ రథయాత్ర, కార్ ఫెస్టివల్( car festival), శ్రీ గుండి చా యాత్ర వంటి అనేక పేర్లతో ఈ ఉత్సవాన్ని పిలుస్తారు. ఏటా పూరీలో వైభవంగా జరిగే ఈ జగన్నాధ రథయాత్రను కలరా చూసేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆషాడ మాసం శుక్లపక్ష ద్వితీయ తిథి నాడు ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. సాధారణంగా జూన్ లేదా జూలై నెలలోనే ఈ యాత్ర వస్తుంది. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర జూన్ 12న పూర్ణిమ లేదా దేవతలకు జరిగే ఆచార స్నానంతో ప్రారంభమైంది. కానీ రేపటి నుంచి రథయాత్రను నిర్వహిస్తున్నారు. మరోవైపు పూరీ జగన్నాథ రథయాత్రకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. జూన్ 12న స్నాన పూర్ణిమ నిర్వహించారు. జూన్ 13 నుంచి 26 వరకు అనవసర కాలంగా పరిగణించారు. 26 న నేత్రోత్సవం నిర్వహించనున్నారు. 27న పూరీ జగన్నాథ రథయాత్ర జరగనుంది. జూలై 1న హెరాపంచమి, జూలై 4న బహుడాయాత్ర, జూలై ఐదున సునాభేష, ఆరున నీలాద్రి విజయ నిర్వహించనున్నారు. ఈ జగన్నాథ రథయాత్ర పండుగ జగన్నాథుడు తన మేనత్త గుండిచా దేవాలయానికి చేసే ప్రయాణాన్ని తెలుపుతుంది. ఈ ప్రయాణంలో బలభద్రుడు, సుభద్రాదేవీలు జగన్నాథుడితోపాటు ఉంటారు. ఈ ముగ్గురు దేవుళ్ళు తమ జన్మ స్థలానికి వెళ్లే వార్షిక ప్రయాణాన్ని రథయాత్రగా పరిగణిస్తారు.

* శతాబ్దాలుగా ఆనవాయితీ..
పూరీ జగన్నాథ రథయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది అన్న చరిత్రకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు లేవు. శతాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. వేలాది మంది భక్తులు లాగితే కానీ రథం ప్రారంభం కాదు. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇలా రథయాత్ర ప్రారంభమవుతుందో లేదో వరుణుడు కరుణిస్తాడు. రథయాత్ర సమయంలో తప్పకుండా వర్షం పడుతుందన్నది భక్తుల నమ్మకం. ప్రతి ఆట ఇది కనిపిస్తుంది కూడా. ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పూరి క్షేత్రం. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ లో ఇది ఒకటి. సాధారణంగా ఈ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ జగన్నాథుడి రథయాత్రలో మాత్రం ఆలయంలోని మూలవిరాట్ విగ్రహాలనే పెడతారు. ప్రతి ఆట కొత్త రథం తయారు చేస్తారు. 9 మంది ముఖ్య శిల్పులు.. 125 మంది సహాయకులు అక్షయ తృతీయ నాడు రథం నిర్మాణం మొదలుపెడతారు. జగన్నాథుడి రథాన్ని నంది ఘోషగా పిలుస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. సుభద్ర దేవి రథాన్ని పద్మ ధ్వజం అంటారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్ళను కడతారు. అయితే జగన్నాధుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండి చా గుడికి చేరుకోవడానికి.. దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇలా రథయాత్ర ప్రతి అంశము ప్రత్యేకతే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular