Jagan Chandrababu: ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ ప్రభాస్ చెప్పిన ఫేమస్ డైలాగ్ ను ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అక్షరాల అమలు చేస్తున్నారు. తన ఎంత పగవాడు అయినా కూడా చంద్రబాబు కరోనా బారినపడగానే ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.. ‘మీరూ త్వరగా కోలుకోవాలి చంద్రబాబు గారూ’ అంటూ ఆకాంక్షించారు.
రాజకీయాలన్నాక కోపతాపాలు.. శత్రుత్వాలు, పగలు, ప్రతీకారాలు కామన్.. ముఖ్యంగా ఇద్దరూ రాయలసీమకే చెందిన జగన్, చంద్రబాబులో ఆ పాళ్లు ఎక్కువే.. మొన్నటికి మొన్న నిండు ప్రెస్ మీట్ లోనే చంద్రబాబును చొక్కా తడిసేలా ఏడిపించేశాడు జగన్. తన 40 ఇయర్స్ పాలిటిక్స్ లో ఏడవని చంద్రబాబు జగన్ ధాటికి వలవలా ఏడ్చేశాడు. జగన్ తండ్రి వైఎస్ఆర్ ను సైతం ముప్పుతిప్పలు పెట్టిన పెద్దమనిషి చంద్రబాబు ఫాఫం జగన్ పాలిటిక్స్ కు తట్టుకోలేకపోతున్నారు.
అయితే అదంతా రాజకీయం బై.. గంతే ఉంటది.. కానీ ఇప్పుడు యోగ క్షేమాల వరకూ వచ్చేసరికి ఆ సాదాసీదా పలకరింపులు నిజంగానే వైరల్ అవుతుంటాయి.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారినపడ్డారు. ఆయన కుమారుడికి నిన్న వైరస్ సోకగా.. అదే ఇంట్లో ఉంటున్న చంద్రబాబుకు ఈరోజు సోకింది.
తాను కరోనా బారినపడినట్లు.. స్వల్ప లక్షణాలు ఉన్నట్టు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరాతీశారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు.
ఎప్పుడూ ఊప్పు నిప్పులా ఉండే చంద్రబాబు , జగన్ లు ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు చూపిన చొరవకు అందరూ ఫిదా అవుతున్నారు. రాజకీయం వేరు.. రాచ మర్యాదలు వేరు అని వీరు నిరూపించారు. ఒక మంచి సంప్రదాయానికి జగన్ పురుడు పోశారనే చెప్పాలి.
ఇక ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు 5వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమా సహా చాలా మంది టీడీపీ నాయకులు కరోనా బారినపడ్డారు. చాలా మంది ప్రముఖులు కరోనా పాజిటివ్ గా తేలారు. ఈక్రమంలోనే చంద్రబాబు సైతం పడ్డారు. చంద్రబాబుకు జగన్ పలకరింపు మాత్రం అందరి మనసు దోచేసింది..