Jagan to follow KCR formula : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక డిఫెరెంట్ స్ట్రాటజీతో రాజకీయాల్లో పైకి ఎదిగారు. చచ్చుబడిన తెలంగాణ వాదాన్ని ఒక్కరోజులో పైకి తీసుకురాగల నేర్పు వ్యూహం కేసీఆర్ సొంతం.. హుజూరాబాద్ లో ఈటల గెలుపు సంబరాలను కూడా ‘ధాన్యం కొనుగోళ్లలో’ కొట్టుకుపోయేలా చేయగల సామర్థ్యం కేసీఆర్ కే ఉంది. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ ప్రజల్లో తన పరపతిని నిలబెట్టుకోవడానికి, తన బలాన్ని నిరూపించకుకోవడానికి ఒక విచిత్రమైన వ్యూహాన్ని అనుసరించేవారు.
తెలంగాణ సెంటిమెంట్ ను ఎల్లప్పుడూ కొనసాగించేందుకు తన పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయించి భారీ మెజార్టీతో గెలిచి తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి నిరూపించేలా వ్యూహం పన్నేవారు.
2006లో కరీంనగర్ ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేయడంతో ఈ వ్యూహం ప్రారంభమైంది. 2011 వరకూ ఇలానే పలు దఫాలుగా రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించి పార్టీని బతికించారు కేసీఆర్. అన్నిఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ భారీ మెజారిటీతోనే గెలిచేది.
2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి సంవత్సరం ఒక ఎన్నిక జరిగేలా చూసుకుంటూ అన్నింట్లోనూ టీఆర్ఎస్ ను భారీ ఆధిక్యతతో గెలిపించి టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు నిజమైన ప్రతినిధి అని ప్రజలకు కేసీఆర్ చూపించేవారు. అయితే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈ వ్యూహం వర్కౌట్ కాలేదన్నది వేరే విషయం.
Also Read: కోర్టు అక్షింతలు వేసినా వెనక్కు తగ్గని జగన్ సర్కారు.. కర్నూలుకు ఆఫీసుల షిఫ్టింగ్..
ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ కూడా రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న పట్టును, ప్రల మద్దతును నిరూపించుకునేందుకు అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. గత రెండున్నరేల్లలో గ్రామ పంచాయతీల నుంచి గ్రామీణ స్థానిక సంస్థల మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకూ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికలు జరిగాయి. దీంతోపాటు తిరుపతి లోక్ సభ , బద్వేలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు అన్ని ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ అజేయమని నిరూపించుకోవాలని జగన్ భావిస్తున్నాడు.
ఈ క్రమంలోనే టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వంటి ఇతర టీడీపీ నేతలను రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో పోటీచేయించాలని జగన్ కోరుతున్నట్టు సమాచారం. తద్వారా కొన్ని నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.. అలా కేసీఆర్ లాగానే జగన్ గెలుపు పరంపరను కొనసాగించి ప్రజల్లో పట్టు నిలుపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Also Read: కేంద్రం చూస్తోంది.. జగన్ జాగ్రత్త అంటున్న బీజేపీ నేతలు