Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు.
Bheemla Nayak
Also Read: స్పందించని వకీల్ సాబ్.. సీఎం సాబ్ పై మంటే కారణమా !
ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. కాగా వచ్చే ఏడాది జనవరి 12 న సంక్రాంతి కానుకగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే గత కొన్ని రోజుల నుంచి భీమ్లా నాయక్ వాయిదా పడుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసంవ ఈ మూవీని వాయిదా వేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా దీనిపై భీమ్లా నాయక్ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. జనవరి 12నే సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ను నిర్మాత నాగ వంశీ రిలీజ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ కొద్ది సేపట్లోనే వైరల్ గా మారింది. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Theatressssss RACHA RACHEEEEE !! 🔥
Galagalagala laaaa laaaaaa !!
JAN 12th BHEEMMMLAAAAA 💥💥💥💥💥#BheemlaNayakOnJan12th 🔥🔥🔥🔥🔥🔥 https://t.co/q0DTiWMokJ
— thaman S (@MusicThaman) December 7, 2021
Also Read: రాజమౌళితో పవన్ కళ్యాణ్ కి ఇక కష్టమే !