https://oktelugu.com/

బాబును మించిపోయిన జగన్.. అప్పుల్లో ఏపీ సరికొత్త రికార్డు

కిందటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికే చంద్రబాబు నాయుడు ఖాజనాను ఖాళీ చేశారు. దీంతో జగన్ సర్కార్ ఏపీని ఎలా గాడిపెడుతారనే చర్చ  కొన్నిరోజులపాటు జోరుగా నడిచింది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పాలనలో చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు కన్పిస్తోంది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు అందినకడల్లా అప్పులు చేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బాటలోనే వెళుతుండటం గమనార్హం. Also Read: టీటీడీ ఈవోను బదిలీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 12:24 PM IST
    Follow us on

    కిందటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికే చంద్రబాబు నాయుడు ఖాజనాను ఖాళీ చేశారు. దీంతో జగన్ సర్కార్ ఏపీని ఎలా గాడిపెడుతారనే చర్చ  కొన్నిరోజులపాటు జోరుగా నడిచింది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పాలనలో చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు కన్పిస్తోంది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు అందినకడల్లా అప్పులు చేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బాటలోనే వెళుతుండటం గమనార్హం.

    Also Read: టీటీడీ ఈవోను బదిలీ చేసిన జగన్.. అసలు కారణం అదేనా?

    గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జగన్ శయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతీఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించే లక్ష్యంతో జగన్ సర్కార్ ముందుకెళుతోంది. అయితే ఇందుకోసం జగన్ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ ఏపీ ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలయ్యేలా చేస్తుండటంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇలానే అందినకడల్లా అప్పులు చేసుకుంటూ పోతూ రాష్ట్రం దివాళాతీయడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నారు.

    జగన్ సర్కార్ గత 16నెలల కాలంలో ఒక లక్షా 30వేల కోట్ల రుణాలు తీసుకురాగా మరిన్ని అప్పుల కోసం ఆర్థిక శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఒక్కో కుటుంబానికి 16నెలల కాలంలో సగటున రూ.20 వేల నుంచి రూ.30వేల లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులను రాష్ట్రంలోని ప్రజలందరికీ పంచితే ఒక్కొక్కరిపై రూ.26వేల భారం పడుతోంది. సగటున ఒక్కో కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారనుకంటే ఆ కుటుంబంపై గడిచిన 16నెలల్లో అక్షరాలా ఒక లక్షా 4వేల అప్పు భారం పడుతోంది.

    దీని వల్ల ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినవారితోపాటు పథకాలకు నోచుకోని కుటుంబాలపై భారం పడుతోంది. పైగా అప్పులను తిరిగి చెల్లించేందుకు ప్రజలపై భారం మోపాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం కూడా అప్పులు.. వడ్డీ చెల్లింపుకే సరిపోతుంది. అప్పులుపోగా మిగిలిన డబ్బులను ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు, సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతోంది. దీంతో ఏపీ అభివృద్ధికి నోచుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    Also Read: ఏపీలో పాగా వేసుడే బీజేపీ టార్గెటా?

    అప్పులు చేయడంలో చంద్రబాబు ఒక ఆకు చదివితే.. జగన్ రెండాకులు చదివాడనే టాక్ విన్పిస్తోంది. ఏపీ సర్కార్ ఇలానే అప్పులు చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో ప్రజలపై పన్నుల భారం తడిచిమోపడవడం ఖాయంగా కన్పిస్తోంది. ఇకనైనా జగన్ సర్కార్ అప్పులపై నియంత్రణ విధించుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఏపీ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.