Jagan Strategies: రాజకీయాల్లో వ్యూహాలు రచించడం కొత్తేమీ కాదు. ఎదుటి పార్టీని ఢీకొనే క్రమంలో ఎంత కఠినమైన నిర్ణయమైనా అమలు చేసేందుకు వెనకాడరు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఓ పాచిక వేసింది. బీసీ ఓట్లపై తన వైఖరి వెల్లడించేందుకు ఏకంగా బీసీ సంఘాల నేతనే తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించి సాహసం చేసింది. అదీ కూడా తెలంగాణ వ్యక్తికి అవకాశం ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. దీంతో రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కొత్త విధానానికి తెర తీస్తున్నట్లు చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ప్రకటించి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. దీంతో అప్పటి నుంచి అప్పట్లో చంద్రబాబు కృష్ణయ్యనే అస్త్రంగా ప్రయోగించారు. తరువాత 2018లోనూ మిర్యాల గూడ నుంచి పోటీ చేసిన కృష్ణయ్య ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
Also Read: NTR Centenary Celebrations: ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. భారతరత్న పరిస్థితి ఏమిటి ?
ప్రస్తుతం వైసీపీ కూడా ఆర్ కృష్ణయ్య బాణాన్ని వదులుతున్నట్లు తెలుస్తోంది. బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీసీ ఓట్లు రాబట్టుకునే వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. బీసీ సంఘాల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కృష్ణయ్య నియామకంతో జగన్ వ్యూహం ఫలిస్తుందా? బీసీ ఓట్లు రాబట్టుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది.

తెలంగాణలో బాబు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు జగన్ అవలంభిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో చంద్రబాబు కేసీఆర్ పై వదిలిన బీసీ అస్త్రాన్ని సంధించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో జగన్ కృష్ణయ్య విషయంలో వేసుకున్న అంచనాలు నిజమవుతాయా? లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. దీనికి ఇంకా సమయముంది. రాబోయే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.
Also Read:Anti-Conversion Bill: మతమార్పిడి బిల్లు.. బీజేపీ తెస్తున్న మరో దుమారం.. ఏం జరుగనుంది?
Recommended Videos