https://oktelugu.com/

పవర్ ఉన్న వాళ్ళని జగన్ పట్టించుకోరా..?

తాజాగా వైసీపీ డిజిటల్ మీడియా ఒక ఇమేజ్ ను రిలీజ్ చేసింది. “అవినీతి మీద ప్రభుత్వం పోరాటం చేస్తోంది…. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తాం” అని అందులో ఉంది. సరే ఇక్కడ వరకు బాగుంది. నిజంగా జగన్ మోహన్ రెడ్డి అవినీతి లేని ఏపీ చూపించగలిగితే ఇప్పటి నుండి మరొక 30 ఏళ్ల వరకు అతనే సీఎం. అందులో సందేహమే లేదు. కానీ క్షేత్రస్థాయిలో రాష్ట్రం పరిస్థితి, అతని పార్టీ పరిస్థితి ఎలా ఉందో అతనికి కనీస అవగాహన […]

Written By: , Updated On : September 3, 2020 / 10:07 AM IST
AP Mudragada Kapu movement ... Is it a new headache for Jagan ..?

AP Mudragada Kapu movement ... Is it a new headache for Jagan ..?

Follow us on

CM Jagan Mohan Reddy cancels Srisailam visit after fire breaks out at hydroelectric power station- The New Indian Express

తాజాగా వైసీపీ డిజిటల్ మీడియా ఒక ఇమేజ్ ను రిలీజ్ చేసింది. “అవినీతి మీద ప్రభుత్వం పోరాటం చేస్తోంది…. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తాం” అని అందులో ఉంది. సరే ఇక్కడ వరకు బాగుంది. నిజంగా జగన్ మోహన్ రెడ్డి అవినీతి లేని ఏపీ చూపించగలిగితే ఇప్పటి నుండి మరొక 30 ఏళ్ల వరకు అతనే సీఎం. అందులో సందేహమే లేదు. కానీ క్షేత్రస్థాయిలో రాష్ట్రం పరిస్థితి, అతని పార్టీ పరిస్థితి ఎలా ఉందో అతనికి కనీస అవగాహన ఉందా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చెబుతున్నది ఒకటటైతే…. జరుగుతోంది మరొకటి. మధ్యలో ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్లు కామ్ గా ఉండిపోతోంది. అందుకే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అంటున్నారు.

Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ

అవినీతి విషయంలో చిన్న చేపలను బలి చేస్తూ పెద్ద చేపలను ముట్టుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమయ్యాయి. వారరు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదా బడా పారిశ్రామిక వేత్తలు కావచ్చు…. పవర్ ఉన్నోడు చేసిన తప్పులు ప్రభుత్వానికి కనపడవు అన్నది ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట. పైగా కుల రాజకీయాలు…. కక్షపూరిత వ్యవహారాలు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు తీవ్రంగా అవినీతి చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది కానీ వాటిని పగోడి ఆరోపణలని వైసిపి సర్కారు పట్టించుకోవడం లేదు. కానీ వైసిపి లో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న వారే సొంత ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడంతో ఇప్పుడు జగన్ కు ఏమీ అంతుచిక్కడం లేదు.

అయితే ఈ సందర్భంగా అవినీతి మాట వచ్చినప్పుడల్లా వాలంటీర్లను సస్పెండ్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. ఎమ్మెల్యేలు అవినీతి చేసినా కూడా వారినీ సస్పెండ్ చేస్తే మొత్తం సెట్ అవుతుంది కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేల వైసిపికి ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ప్రస్తుతానికైతే లేదు. ఇక సీఎం అవినీతిపరులపై కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఎవరైతే వారికి బలహీనులుగా కనిపిస్తారో వారిపై వేటు వేసుకుంటూ వెళితే చివరికి ఒరిగేది ఏమీ ఉండదు. 

ఉదాహరణకు రమేష్ ఆసుపత్రి ఘటనలో కూడా ఏపీ ప్రభుత్వానికి…. ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఏమి అడ్డు పడుతుందో ఇప్పటికీ ఎవరికీ అర్థంకావడం లేదు. రమేష్ హాస్పిటల్స్ యజమాని రమేష్ పై పెట్టిన శ్రద్ధ ఉన్నతాధికారులపై పెట్టి ఉంటే ఈపాటికి హైకోర్టు ఎప్పుడో వారికి అనుకూలంగా విచారణ కూడా మొదలుపెట్టేది కానీ పక్షపాత ధోరణి చూపిస్తూ పవర్ చేతిలో ఉన్నవారితో పెట్టుకోకపోవడమే మంచిదని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్లుంది. 

ఇదే ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్ సిద్ధం చేయడం.. క్యాబినెట్లో వార్నింగ్ లు ఇవ్వడమ్ లేదా ఫోన్ చేసి పర్సనల్ గా హెచ్చరించడం వంటివి మానుకొని గట్టి ఆధారాలు దొరికినప్పుడే ఒకరి పై వేటు వేసినా సస్పెండ్ చేసినా సబబుగా ఉంటుందన్నది ప్రజల వాదన. మరి జగన్ అంత ధైర్యం చేయగలరా….? ఒకరిని అలా చేస్తే అదే వరుసలో ఇంకెంత మందిని చేయాల్సి వస్తదో అని భయపడుతున్నారా…? 

Also Read : ఒకే ఒక్క దెబ్బతో బాబు కుల రాజకీయం బట్టబయలు…?