అమరావతి రైతులపై ‘జగన్ మార్క్’ బెదిరింపు..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వికేంద్రీకరణ బిల్లును ఎంత ఆపాలని చూసిన సాధ్యం కాలేదు. సీఎం జగన్ పంతంతో శాసనమండలిని రద్దుచేసి మరీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకున్న సంగతి తెల్సిందే. ఇటీవలే గవర్నర్ కూడా ఈ బిల్లుపై సంతకం చేయడంతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. Also Read: అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..? ఈ మేరకు ప్రభుత్వం […]

Written By: NARESH, Updated On : September 8, 2020 6:06 pm
Follow us on

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వికేంద్రీకరణ బిల్లును ఎంత ఆపాలని చూసిన సాధ్యం కాలేదు. సీఎం జగన్ పంతంతో శాసనమండలిని రద్దుచేసి మరీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకున్న సంగతి తెల్సిందే. ఇటీవలే గవర్నర్ కూడా ఈ బిల్లుపై సంతకం చేయడంతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది.

Also Read: అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?

ఈ మేరకు ప్రభుత్వం వీలైనంత తర్వాత రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం చర్యలను అమరావతి రైతులు, టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ మూడు రాజధానులను వ్యతిరేకించడంతో మిగతా ప్రాంతాల్లో టీడీపీ కనుమరుగయ్యేలా కన్పిస్తోంది. దీంతో టీడీపీ నేతలు మునుపటిలా ఈ విషయంలో మాట్లాడటం లేదు. కేవలం కోర్టుల్లో కేసులు వేస్తూ రాజధాని తరలిపోకుండా అడ్డుపడున్నారు.

ఈ విషయంలో టీడీపీ సైలంటవ్వడంతో అమరావతి రైతులే రాజధాని కోసం ముందుండి పోరాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వారిని నయనోభయానో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం అమరావతి ప్రజలకు అండగా ఉంటామని చెబుతున్నా రైతులు పట్టువదలకపోవడంతో జగన్ సర్కార్ బెదిరింపు చర్యలకు దిగుతోంది.

ఆ ప్రాంతానికి చెందిన మంత్రి కొడాలి నాని ఇటీవల సీఎం జగన్ కు ఒక రాసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. పేదలకు చోటులేని ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కూర్చుని శాసనాలు చెయ్యడం భావ్యం కాదని మంత్రి చెప్పుకొచ్చారు. అందుకే అమరావతిలో శాసనసభ కూడా వద్దని సూచించినట్లు మంత్రి జగన్ సూచినట్లు లేఖను విడుదల చేశారు.

Also Read: ఎంత ఘోరం:పాడైపోయిన బీర్లు ఏపీ ప్రజలు తాగారా?

అమరావతి రైతులు ఇలాగే పోరాటం చేస్తే మీకు శాసన రాజధాని కూడా ఉండదనే ఉద్దేశం వచ్చేలా ఈ లేఖ ఉందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. సీఎం జగన్ మొండితనం తెలిసిన అమరావతి రైతులు  రాజధాని ఉద్యమంపై వెనక్కి తగ్గి ప్రభుత్వానికి సహకరిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.