నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్….?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ప్రైవేట్ రంగంపై కరోనా వైరస్ చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై వైరస్ ప్రభావం పడింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇప్పట్లో పలు ప్రైవేట్ రంగాలు కోలుకునే స్థితిలో కనిపించడం లేదు. కంపెనీలన్నీ ఉన్న ఉద్యోగులకే ఉద్వాసన పలుకుండటంతో కొత్త ఉద్యోగాల ఊసే వినిపించడం లేదు. Also Read […]

Written By: Navya, Updated On : September 17, 2020 3:51 pm
Follow us on

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ప్రైవేట్ రంగంపై కరోనా వైరస్ చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై వైరస్ ప్రభావం పడింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇప్పట్లో పలు ప్రైవేట్ రంగాలు కోలుకునే స్థితిలో కనిపించడం లేదు. కంపెనీలన్నీ ఉన్న ఉద్యోగులకే ఉద్వాసన పలుకుండటంతో కొత్త ఉద్యోగాల ఊసే వినిపించడం లేదు.

Also Read : వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విజయసాయి..?

గోరుచుట్టుపై రోకలి పోటులా దేశంలో కరోనాకు ముందే భారీగా నిరుద్యోగులు ఉండగా ఈ వైరస్ నిరుద్యోగుల సంఖ్యను అమాంతం పెంచేసింది. అయితే తాజాగా జగన్ సర్కార్ నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు రుణాలు ఇచ్చే విధంగా జగన్ సర్కార్ ముందడుగులు వేస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని రంగాల వారికి ప్రయోజనం చేకూరడం లేదు.

జగన్ సర్కార్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగంలో పని చేసే వారికి మేలు చేకూర్చే దిశగా అడుగులు వేస్తోంది. నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు అవసరమైన పనిముట్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రుణాలు పొందవచ్చని జగన్ సర్కార్ పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిర్మాణ రంగంలో ఉపాధి కోల్పోయిన వాళ్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.

అయితే సాధారణ నిరుద్యోగులు మాత్రం తమకు కూడా ప్రయోజనం చేకూరేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలను కోల్పోయామని సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు ప్రభుత్వం ప్రజలకు ఆదుకునే దిశగా అడుగులు వేయాలని పేర్కొంటున్నారు. వీరి విషయంలో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.

Also Read : దుర్గగుడి ఆ మూడు సింహాలు ఆయన ఇంట్లోనే ఉంటాయి: మాజీ మంత్రి సంచలనం