https://oktelugu.com/

దెబ్బకు చేతులెత్తి దండం పెట్టిన బండ్ల గణేష్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటుడు, తెలుగు నిర్మాత బండ్ల గణేష్.. సీటు దక్కకపోవడంతో నిరాశకు గురి అయ్యారు. తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రసమితి -కేసీఆర్ పాలనపై సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్న ఆయన మాటలు చర్చనీయాంశంగా మారాయి. Also Read: చరిత్ర దాచిన తెలంగాణ ‘సాయుధ పోరాటం’! అయితే రాజకీయాల్లో దెబ్బతిన్న బండ్ల […]

Written By: , Updated On : September 17, 2020 / 12:52 PM IST
Bandla ganesh

Bandla ganesh

Follow us on

Bandla ganeshతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటుడు, తెలుగు నిర్మాత బండ్ల గణేష్.. సీటు దక్కకపోవడంతో నిరాశకు గురి అయ్యారు. తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రసమితి -కేసీఆర్ పాలనపై సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్న ఆయన మాటలు చర్చనీయాంశంగా మారాయి.

Also Read: చరిత్ర దాచిన తెలంగాణ ‘సాయుధ పోరాటం’!

అయితే రాజకీయాల్లో దెబ్బతిన్న బండ్ల గణేష్  తత్త్వం బోధపడి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.   ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని ప్రకటించారు. కాంగ్రెస్ కు తనకు సంబంధం లేదన్నారు..

తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేయాలని తపించిన తారలు ఎంతో మంది ఉన్నారు. మెగాస్టార్  చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాల్లో అగ్రతారలు ఎదిగి రాజకీయాల్లో ఫ్లాప్ అయ్యారు. బాలయ్య పార్ట్ టైం పొలిటీషియన్ అయ్యారు. రోజాకు వైసీపీలో అగ్రతాంబూలం దక్కలేదు.

అయితే వీరి ఆశతో వెళ్లిన బండ్ల గణేష్ కు కూడా కాలం కలిసిరాలేదు. తెలంగాణ కాంగ్రెస్ లో చేరి ‘7ఓ క్లాక్ బ్లేడుతో కాంగ్రెస్ గెలవకుంటే గొంతు కోసుకుంటానని’ ఆయన ఎన్నిక వేళ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. కానీ కాంగ్రెస్ పరాజయంతో బండ్ల రాజకీయమే ముగిసింది.రాజకీయాలకు గుడ్ బై చెప్పి సుబ్బరంగా మళ్లీ సినిమాల బాటపట్టాడు.

Also Read: తల్లి సాహసం.. పిల్లలను కాపాడి తనువు చలింపు

తాజాగా ఓ నెటిజన్ బండ్లకు ఓ అరుదైన ప్రశ్న వేశాడు. ‘బండ్ల అన్నా.. నువ్వు మళ్లీ బీజేపీలో చేరుతున్నావా?’ అని ట్విట్టర్ లో అడడగా.. బండ్ల గణేష్ చేతులెత్తి దండం పెట్టే సింబల్ పెట్టి ‘నో పాలిటిక్స్ బ్రదర్’ అంటూ తేల్చేశాడు. ఇక రాజకీయాల్లోకి రాను అంటూ తేల్చిచెప్పారు.

ఇటీవల అలీతో సరదాగా షోలోనూ ఇక సినిమాలే తన జీవితం అని.. నటుడిగా కంటే నిర్మాతగా 100మందికి ఉపాధి కల్పిస్తానని బండ్ల చెప్పుకొచ్చాడు.