రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నగదు బదిలీ దిశగా అడుగులు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. విద్యుత్ సరఫరాకు సంబంధించి సెప్టెంబర్ నెల ఖర్చు 6.05 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంధన శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్రం విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర […]

Written By: Navya, Updated On : October 15, 2020 8:39 am
Follow us on

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నగదు బదిలీ దిశగా అడుగులు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. విద్యుత్ సరఫరాకు సంబంధించి సెప్టెంబర్ నెల ఖర్చు 6.05 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంధన శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

కేంద్రం విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యుత్ శాఖకు నేరుగా చెల్లించిన సబ్సిడీని ఇకపై రైతుల ఖాతాల్లోనే జమ చేసే దిశగా అడుగులు వేస్తోంది. అధికారులు ఈ పథకం అమలు కోసం శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నారు. ప్రభుత్వం ఈ పథకం అమలు ద్వారా రైతులపై రూపాయి కూడా భారం పడకుండా చర్యలు తీసుకుంటామని చెబుతుండటం గమనార్హం. ప్రభుత్వం జమ చేసిన నగదు రైతుల ఖాతాలలో జమైన తరువాతే ఆ నగదును విద్యుత్ సంస్థకు పంపేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

2020 – 21 సంవత్సరానికి జగన్ సర్కార్ వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 8,573 కోట్ల రూపాయలు కేటాయించింది. తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ శ్రీకాకుళం జిల్లాలో కనెక్షన్లు, విద్యుత్ లోడ్ ను బట్టి నగదు బదిలీకి అయ్యే ఖర్చును లెక్కించనుంది. ఏపీఈఆర్‌సీ ఒక్కో యూనిట్‌ ధర 6.58 రూపాయలుగా నిర్ణయించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో 25,971 వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. జిల్లాలో ఉన్న వ్యవసాయ పంపుసెట్ల వినియోగ సామర్థ్యం 1,02,963 హార్స్‌పవర్‌.

ఈపీడీసీఎల్‌ ఈ లెక్కల ప్రకారం సెప్టెంబర్ నెల విద్యుత్ సబ్సిడీ 6.05 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లో చేరుతుంది. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఈ పథకంపై రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.