Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi: అమరావతిపై తొందరపడని జగన్ సర్కార్

Amaravathi: అమరావతిపై తొందరపడని జగన్ సర్కార్

AmaravathiAmaravathi: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మూడు రాజధానుల విషయం మూలకు పడినట్లు కనిపిస్తోంది. దానిపై ఎవరు పట్టించుకోవడం లేదు. కోర్టు కూడా వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి(Amaravathi) పిటిషన్ పై విచారణ నవంబర్ 15కు వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో పిటిషనర్లు వాయిదా కోరడంతో ప్రభుత్వ లాయర్లు హైకోర్టు ఇష్టమని చెప్పడంతో వాయిదాకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. హైకోర్టు నవంబర్ 15కు వాయిదా వేసింది. వాదనలకు ఇరు వర్గాలు ఆసక్తి చూపకపోవడంతో మూడు రాజధానుల పిటిషన్ పై కోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వమే. కానీ ప్రస్తుతం దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం ముందుకు సాగేలా కనిపించడం లేదు.

మూడు రాజధానుల వ్యవహారంపై సీజే ఏకే గోస్వామి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. కరోనా కారణంగానే అప్పట్లో ఆగస్టుకు వాయిదా వేసినా మళ్లీ నవంబర్ కు పొడిగించడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ. కోర్టు కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నా ఈ కేసులో వాయిదాలు కోరడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని తెలుస్తోంది. అమరావతి విచారణకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు పై ప్రభుత్వం నిర్దిష్టంగా వ్యవహరించడం లేదని సమాచారం.

పిటిషనర్లు, ప్రభుత్వం రాజధాని వ్యాజ్యాల విషయంలో వాయిదాలకు ఒప్పుకోవడంతో ఈ అంశం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసు మరింత కాలం పెండింగులో పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సైతం సీఎం జగన్(CM Jagan) తన ప్రసంగంలో మూడు రాజధానుల విషయం లేకుండా చూసుకున్నారు. దీంతో ఇప్పట్లో మూడు రాజధానుల వ్యవహారంపై పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలతోనే ఈ వ్యవహారం పెండింగులో పడిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం మూడు రాజధానులపై ఇప్పట్లో పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అటు పిటిషనర్లలో ఇటు ప్రభుత్వంలో ఎలాంటి చొరవ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాజధానుల విషయం ఇప్పట్లో పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి వాసుల ఆందోళనల నేపథ్యంలో దీనిపై తేల్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version