Amaravathi: అమరావతిపై తొందరపడని జగన్ సర్కార్

Amaravathi: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మూడు రాజధానుల విషయం మూలకు పడినట్లు కనిపిస్తోంది. దానిపై ఎవరు పట్టించుకోవడం లేదు. కోర్టు కూడా వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి(Amaravathi) పిటిషన్ పై విచారణ నవంబర్ 15కు వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో పిటిషనర్లు వాయిదా కోరడంతో ప్రభుత్వ లాయర్లు హైకోర్టు ఇష్టమని చెప్పడంతో వాయిదాకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. హైకోర్టు నవంబర్ 15కు వాయిదా వేసింది. వాదనలకు ఇరు వర్గాలు ఆసక్తి చూపకపోవడంతో మూడు రాజధానుల పిటిషన్ […]

Written By: Srinivas, Updated On : August 23, 2021 4:48 pm
Follow us on

Amaravathi: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మూడు రాజధానుల విషయం మూలకు పడినట్లు కనిపిస్తోంది. దానిపై ఎవరు పట్టించుకోవడం లేదు. కోర్టు కూడా వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి(Amaravathi) పిటిషన్ పై విచారణ నవంబర్ 15కు వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో పిటిషనర్లు వాయిదా కోరడంతో ప్రభుత్వ లాయర్లు హైకోర్టు ఇష్టమని చెప్పడంతో వాయిదాకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. హైకోర్టు నవంబర్ 15కు వాయిదా వేసింది. వాదనలకు ఇరు వర్గాలు ఆసక్తి చూపకపోవడంతో మూడు రాజధానుల పిటిషన్ పై కోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వమే. కానీ ప్రస్తుతం దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం ముందుకు సాగేలా కనిపించడం లేదు.

మూడు రాజధానుల వ్యవహారంపై సీజే ఏకే గోస్వామి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. కరోనా కారణంగానే అప్పట్లో ఆగస్టుకు వాయిదా వేసినా మళ్లీ నవంబర్ కు పొడిగించడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ. కోర్టు కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నా ఈ కేసులో వాయిదాలు కోరడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని తెలుస్తోంది. అమరావతి విచారణకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు పై ప్రభుత్వం నిర్దిష్టంగా వ్యవహరించడం లేదని సమాచారం.

పిటిషనర్లు, ప్రభుత్వం రాజధాని వ్యాజ్యాల విషయంలో వాయిదాలకు ఒప్పుకోవడంతో ఈ అంశం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసు మరింత కాలం పెండింగులో పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సైతం సీఎం జగన్(CM Jagan) తన ప్రసంగంలో మూడు రాజధానుల విషయం లేకుండా చూసుకున్నారు. దీంతో ఇప్పట్లో మూడు రాజధానుల వ్యవహారంపై పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలతోనే ఈ వ్యవహారం పెండింగులో పడిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం మూడు రాజధానులపై ఇప్పట్లో పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అటు పిటిషనర్లలో ఇటు ప్రభుత్వంలో ఎలాంటి చొరవ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాజధానుల విషయం ఇప్పట్లో పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి వాసుల ఆందోళనల నేపథ్యంలో దీనిపై తేల్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.