Jagan Target Pawan Movies: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సినిమా పరిశ్రమపై జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. పవన్ సినిమా విషయంలో ఒకలా మిగతా సినిమాల విషయంలో మరోలా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలకు ముందే సినిమా టికెట్ల ధరలు తగ్గించి లాభాలు రాకుండా చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. సినిమాల విషయంలో సీఎం ప్రోద్బలం ఏమిటని ప్రశ్నలు వస్తున్నా జగన్ మాత్రం తగ్గడం లేదు.

అన్ని సినిమాలకు కాకుండా ఒక పవన్ కల్యాణ్ సినిమాలనే లక్ష్యంగా చేసుకుని అవి ఆడకుండా చేసేందుకు అడ్డుకట్ట వేస్తున్నారు. గతంలో కూడా వకీల్ సాబ్ సినిమాను కూడా ఇలాగే చేసినా అది విజయవంతంగా ప్రదర్శితం కావడంతో లాభాలు వచ్చాయి. కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించడంతో సినిమా ఆశించిన స్థాయిలో లాభాలు రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సినిమాల విషయంలో రాజకీయాలు ఎందుకని అందరు చెబుతున్నా జగన్ మాత్రం తాను అనుకున్నది చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే.
Also Read: మోడీకి ఆ ఇద్దరు సీఎంల నుంచి పోటీ తప్పదా.. తాజా ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం
సినిమా వినోదాన్ని తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో టికెట్ల ధరలు తగ్గించినట్లు చెబుతున్నా ఒక్క పవన్ కల్యాణ్ సినిమాలను మాత్రమే టార్గెట్ చేసుకుని ధరలు తగ్గించి తరువాత పెంచడంతో ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగానే అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సినిమా ఆడకుండా చేయాలనేదే వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతోందని తెలుస్తోంది. పవన్ సినిమాలనే లక్ష్యంగా చేసుకుని మరీ టికెట్ల రేట్లు తగ్గించడంపై అప్రదిష్ట వస్తున్నా లెక్కచేయడం లేదు.

భీమ్లా నాయక్ విడుదలైన రెండు వారాలకే టికెట్ల రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వెనుక రహస్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయడంతో అప్పటి నుంచి పవన్ సినిమాలను కావాలనే టార్గెట్ చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఏపీలో కొనసాగుతున్న పరిణామాలు పూర్తిగా పవన్ కు వ్యతిరేకంగా సాగుతున్నట్లు సమాచారం. జగన్ నిర్ణయంపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ సినిమాల విషయంలో కలుగజేసుకోకపోవడమే మేలనే వాదన కూడా వస్తోంది.