మానవీయ కోణంలో జగన్ మరో నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మానవీయ కోణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో రేషన్ కార్డు ఉన్న వారికి సర్కార్ ఉచితంగా రేషన్ పంపిణీ, కుటుంబానికి రూ.1000 చొప్పున మంజూరు చేస్తుంది. అయితే కొంత మందికి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో సర్కార్ మానవతా ధృక్పధంతో రేషన్ కార్డు లేని వారికి కూడా ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 1:17 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మానవీయ కోణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో రేషన్ కార్డు ఉన్న వారికి సర్కార్ ఉచితంగా రేషన్ పంపిణీ, కుటుంబానికి రూ.1000 చొప్పున మంజూరు చేస్తుంది. అయితే కొంత మందికి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో సర్కార్ మానవతా ధృక్పధంతో రేషన్ కార్డు లేని వారికి కూడా ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే తాజాగా రేషన్ కార్డు లేని వారిలో అర్హులను గుర్తించి వారికి కూడా రూ.1000 అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. గ్రామ, వార్డు వాలంటీర్స్ అండ్ విలేజ్, వార్డ్ సెక్రటేరియట్స్ డిపార్ట్ మెంట్ స్పెషల్ సెక్రటరీ కన్నబాబు తెలిపారు.