
డీఎస్సీ అభ్యర్థుల సుధీర్ఘ పోరాటం ఫలించింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జగన్ కరుణించడంతో వారికి ఉద్యోగాలు దక్కాయి. తాజాగా డీఎస్సీ క్యాలిఫైడ్ అభ్యర్థులు సీఎం జగన్ ను కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.
డీఎస్సీ 2008 అభ్యర్థులకు సీఎం జగన్ గొప్ప గుడ్ న్యూస్ చెప్పారు. వారికి జగన్ భరోసానిచ్చారు.డీఎస్సీ 2008లో కామన్ మెరిట్ పాటించకపోవడం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ యూనియన్ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేలు ఇచ్చి ఒప్పంద పద్ధతిలో తీసుకునేందుకు అంగీకరించారు. సీఎం నిర్ణయం మేరకు 2193 మంది అభ్యర్థులను ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకోనున్నారు.
ఎందుకు సీఎంలు మారినా 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యలను పట్టించుకోలేదని.. సీఎం జగన్ మాత్రం మానవత ధృకత్పంతో సమస్య పరిష్కరించారని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం తరుఫున సాయం చేస్తామని సీఎం జగన్ వారికి కొండంత భరోసానిచ్చారు.
ఏపీలోని డీఎస్సీ 2008 అభ్యర్థులకు వర్తించేలా 2193మంది అర్హులకు ఎస్.జీ.టీ పోస్టింగులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీనికి సంబంధించి జీవో విడుదల చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు. ఇక 2018 డీఎస్సీలో నోటిఫై చేసిన 7042 పోస్టులకు గాను ఇప్పటికే 6361 పోస్టులను భర్తి చేసినట్టు మంత్రి ఆదిమలపు సురేష్ తెలిపారు. కోర్టు కేసుల నేపథ్యంలో పెండింగ్ లో పడిన 486 పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇవాళ నియామక పత్రాలు అందిస్తామన్నారు. ఇక 2018 డీఎస్సీలో పెండింగ్ లో ఉన్న 374 పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.
ఇక ఏపీ టెట్ సిలబస్ కూడా విడుదలైంది. ఏపీ టెట్ 2020-21 పరీక్షకు సంబంధించిన సిలబస్ ను సిద్ధం చేసినట్లు మంత్రి సురేష్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని aptet.apcfss.in/ వెబ్ సైట్ లో ఉంచామని మంత్రి తెలిపారు.
ఏపీ టెట్ సిలబస్ ను కింద పీడీఎఫ్ ఫైల్ లో చూడొచ్చు