https://oktelugu.com/

AP CM Jagan: కోర్టు అక్షింతలు వేసినా వెనక్కు తగ్గని జగన్ సర్కారు.. కర్నూలుకు ఆఫీసుల షిఫ్టింగ్..

AP CM Jagan: ఏపీ ప్రజలకు రాజధాని ఏదనే విషయం ఇంకా తేలడం లేదు. మూడు రాజధానులని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కు తీసుకుంది. న్యాయ పరమైన చిక్కుల నేపథ్యంలో అలా చేసినట్లు పేర్కొంది. మళ్లీ త్వరలో ఇంకో సమగ్రమైన బిల్లుతో వస్తామంది. అయితే, న్యాయ రాజధాని విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. న్యాయ రాజధానిగా కర్నూలునే ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనబడుతోంది. కర్నూలుకు ఆఫీసుల తరలింపు చకచకా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2021 / 06:00 PM IST
    Follow us on

    AP CM Jagan: ఏపీ ప్రజలకు రాజధాని ఏదనే విషయం ఇంకా తేలడం లేదు. మూడు రాజధానులని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కు తీసుకుంది. న్యాయ పరమైన చిక్కుల నేపథ్యంలో అలా చేసినట్లు పేర్కొంది. మళ్లీ త్వరలో ఇంకో సమగ్రమైన బిల్లుతో వస్తామంది. అయితే, న్యాయ రాజధాని విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు. న్యాయ రాజధానిగా కర్నూలునే ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనబడుతోంది. కర్నూలుకు ఆఫీసుల తరలింపు చకచకా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఏమంటుకుంటున్నారో తెలుసుకుందాం.

    AP Govt

    మూడు రాజధానుల బిల్లును వైసీపీ సర్కారు వెనక్కు తీసుకుంది. అయితే, ఆఫీసుల షిఫ్టింగ్ మాత్రం ఆపడం లేదు. జగన్ సర్కారు..ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని గెజిట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన ట్రిబ్యూనల్ హైదరాబాద్‌లో ఉండేది. తాజా గెజిట్‌తో ట్రిబ్యూనల్ కర్నూలకు వెళ్లనుంది. అయితే, ఆఫీసుల తరలింపు విషయమై హైకోర్టు స్టే ఉంది. అయినా కార్యాలయాలను తరలిస్తున్నది ఏపీ సర్కారు.

    వక్ఫ్ ట్రిబ్యూనల్‌ను తరలించడం లేదని, అక్కడే ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సర్కారు వాదించే అవకాశం అయితే ఉంది. వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్ అక్కడ ఏర్పడినట్లయితే బాగుంటుందని స్థానికులూ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మెయిన్ ఆఫీస్ ఉంది. ఈ క్రమంలోనే లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అలా కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనుకున్న వైసీపీ ఆలోచన అమలు అవుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, కోర్టు ధిక్కరణ చేసి మరీ ఇలా చేయడం వెనుక వైసీపీ ప్లాన్ ఉందని, కావాలనే ఇలా చేస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

    Also Read: పాపులారిటీ కోసం కేసీఆర్ ఫార్ములానే జగన్ ఫాలో అవుతున్నారా?

    అమరావతియే రాజధానిగా ఉండాలని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అమరావతి రైతులూ ధర్నాలు చేస్తున్నారు. అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతిని రాజధానిగా ఉంచాలని అనుకోవడం లేదు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చింది. అయితే, న్యాయపరమైన ఇబ్బందుల వల్ల వెనక్కు తీసుకున్నప్పటికీ త్వరలో మరో బిల్లు రాబోతున్నదనే చర్చ ఉంది. శ్రీరామనవమి రోజున కొత్త రాజధానిని జగన్ ప్రకటిస్తారనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి మరి.. ఎటువంటి ప్రకటన వస్తుందో. అయితే, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తీవ్రమైన విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయిందని, జగన్ చేతగానితనం వల్లే ఇలా జరుగుతున్నదని ప్రతిపక్ష పార్టీల నేతలూ ఆరోపిస్తున్నారు.

    Also Read: కేంద్రం చూస్తోంది.. జగన్ జాగ్రత్త అంటున్న బీజేపీ నేతలు

    Tags