
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా తొలివేవ్ లో వయసు పైబడిన వారి పైనే ప్రభావం చూపింది. దీంతో చాలా మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఔషధాలు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా మ్యుటెంట్ వేరియేషన్ కారణంగ ఎక్కువ మంది వైరస్ బారిన పడ్డారు.
సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ యువతపై ఎక్కువగా ప్రభావం చూపింది. యువత భారీగా కరోనా బారిన పడ్డారు. 90 శాతం మంది తిరిగి కోలుకున్నారు. వైరస్ ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సందర్భంలో దేశంలో మూడో వేవ్ ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈసారి చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే హెచ్చరికలతో జగన్ సర్కారు ముందుచూపుతో వ్యవహరిస్తోంది. పీడియాట్రిక్ కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. చిన్నారులకు కొవిడ్ వైరస్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సేవలు తదితర విషయాలపై అధ్యయనం చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాుటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వైరస్ రాష్ర్టాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మూడో వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూుతుందని హె చ్చరికలు చేయడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో వేవ్ నుంచి ప్రజలను రక్షించాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.