రూ. లక్ష కోట్లు.. నిధుల కోసం జగన్ అగచాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. నిరంతరం ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణకు నిధులు అనే ఇంధనం కోసం కష్టాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రోజురోజుకు అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇంకామూడేళ్లు గడవాలంటే కష్టమే అని అంటున్నారు పరిశీలకులు. జగన్ పరువు నిలబడాలంటే ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టాల్సిందే. లేకపోతే ప్రభుత్వ మనుగడ కొనసాగడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కోసం, ఉద్యోగుల వేతనాలు, జగనన్న కాలనీలు తదితర ప్రాజెక్టులు మధ్యలోనే ఉన్నాయి. వాటిని […]

Written By: Srinivas, Updated On : July 29, 2021 2:39 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది. నిరంతరం ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణకు నిధులు అనే ఇంధనం కోసం కష్టాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రోజురోజుకు అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇంకామూడేళ్లు గడవాలంటే కష్టమే అని అంటున్నారు పరిశీలకులు. జగన్ పరువు నిలబడాలంటే ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టాల్సిందే. లేకపోతే ప్రభుత్వ మనుగడ కొనసాగడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కోసం, ఉద్యోగుల వేతనాలు, జగనన్న కాలనీలు తదితర ప్రాజెక్టులు మధ్యలోనే ఉన్నాయి. వాటిని కొనసాగించాలంటే నిధులు పెద్ద మొత్తంలోనే సమకూర్చుకోవాల్సిందే.

పోలవరం ప్రాజెక్టుకు రూ.57 వేల కోట్లు పైచిలుకు నిధులు అవసరమవుతాయి. కేంద్రం మాత్రం 2017-18 అంచనాల మేరకే నిధులు ఇస్తామని చెబుతోంది. దీంతో ప్రభుత్వంపై దాదాపు రూ.37 వేల కోట్ల మేర భారం పడనుంది. పెరిగిన వ్యయంతో ప్రభుత్వానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి కేంద్రమే నిధులు భరించాలని చంద్రబాబు కాలం నుంచి కోరుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జగన్ ప్రభుత్వానికి పోలవరం గుదిబండగా మారనుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరోపక్క ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో పథకం జగనన్న ఇళ్ల పథకం. రాష్ర్టవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో రూ.25 వేల కోట్లు అవసరమవుతాయి. కేంద్రం కూడా నిధులు ఇవ్వాలని కోరుతున్నా ససేమిరా అనడంతో రాష్ర్ట ప్రభుత్వంపై నే భారం పడుతోంది. దీంతో ఈ పథకానికి కూడా రాష్ర్టం నిధులు సమకూర్చుకుని పేదల ఇళ్లు పూర్తి చేయాలని సంకల్పించింది.

వీటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు రూ.20 వేల కోట్లు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో జగన్ ప్రభుత్వం మొత్తం లక్ష కోట్ల వరకు నిధులు ఉంటేనే పథకాల నిర్వహణ ముందుకు సాగుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ పథకాలు పూర్తయితేనే జగన్ రాబోయే ఎన్నికలకు పోయే వీలుంటుంది. ఎందుకంటే ఇవన్నీ తన ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలే. దీంతో జగన్ పై మరింత భారం పడనుంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా జగన్ పరిస్థితి అధ్వానంగా మారుతోంది.