https://oktelugu.com/

లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. దీంతో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని డిమాండ్ పెద్దఎత్తున వస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వ పెద్దలకు రిక్వెస్ట్ పెడుతున్నారు. లాక్డౌన్ విధించినపుడు కరోనా కట్టడిలోనే ఉందని.. సడలింపుల అనంతరమే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఇది ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు నగరాల్లో కరోనా పంజా.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 24, 2020 / 12:53 PM IST
    Follow us on


    దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. దీంతో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని డిమాండ్ పెద్దఎత్తున వస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వ పెద్దలకు రిక్వెస్ట్ పెడుతున్నారు. లాక్డౌన్ విధించినపుడు కరోనా కట్టడిలోనే ఉందని.. సడలింపుల అనంతరమే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఇది ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.

    కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు

    నగరాల్లో కరోనా పంజా..
    దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా పంజా విసురుతోంది. ఢిల్లీ, ముంబై, కోలకత్తా, అహ్మదాబాద్, చైన్నె, హైదరాబాద్ వంటి నగరాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నగరాల్లో జనాభా ఎక్కువగా ఉండటంతో ఒకరిని నుంచి ఒకరికి త్వరగా వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా లాక్డౌన్ సడలింపుల అనంతరం నగరాల్లో వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లడంతో ఆయా గ్రామాల్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైరస్ చాపకిందులా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజు కొత్తగా 15,968 కొత్త కేసులు నమోదుకాగా 456మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ తొలివారంలో రోజుకు 10వేల కేసులు నమోదవగా ప్రస్తుతం రోజుకు 15వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

    బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?

    జీహెచ్ఎంసీలో..
    తెలంగాణలోనూ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతవారం రోజులుగా టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. జూన్ 21న తెలంగాణలో 730కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 కేసులు ఉన్నాయి. 22న కొత్తగా 872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 713కేసులు, రంగారెడ్డిలో 107కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 879పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 652కేసులు నమోదుకాగా మేడ్చల్‌లో 112 కేసులు నమోదుకావడం గమనార్హం.

    చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

    స్వచ్చంధంగా లాక్డౌన్..
    రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కొన్ని పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. కొద్దిరోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగింది. దీనిని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఇక జీహెచ్ఎంసీ కార్యాలయంలో సైతం ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడటంతో ప్రజలెవరూ ఆఫీసుకు రావొద్దని సూచించింది. ఏవైనా సమస్యలుంటే ఆన్ లైన్లో ఫిర్యాదు చేయాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి లాక్డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి అవుతుందనే నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు.

    సోషల్ మీడియాలో విజ్ఞప్తులు..
    ఈమేరకు తెలంగాణ ప్రభుత్వానికి నగర వాసులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు నెటిజన్లు ట్యాగ్ చేస్తూ విన్నవిస్తున్నారు. నగరంలో పరిస్థితి చేయిదాటకముందే మెల్కోవాలని కోరుతున్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు తమిళనాడు, ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో లాక్డౌన్ విధించారని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. లాక్డౌన్ విధించాలని సోషల్ మీడియాలో ప్రజల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తుల వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ప్రతీఒక్కరిలో నెలకొంది.